కొరటాల సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త గెటప్…

సినిమా సినిమాకు యాక్టర్స్ మేకోవర్ అవ్వలిసిందే .. రెగ్యులర్ స్టయిల్ ని పక్కన పెట్టి న్యూ లుక్ ట్రై చెయ్యాలిసిందే . హీరోలు మేకోవర్ ట్రై చేసినప్పుడే ఆ మూవీకి కొత్తదనం వస్తుంది …, ఇక అసలు విషయానికి వెళ్ళితే …… 2015 లో డాషింగ్ డైరెక్టర్ పూరీ – యంగ్ టైగెర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ టెంపర్ .. ఈ మూవీ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించారు .. అంతే కాకుండా ఈ మూవీ లో తారక్ సిక్స్ ప్యాక్ చేసి ఇంకా స్టైలిష్ లుక్స్ లో కనబడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు . టెంపర్ మూవీ లో ఎన్టీఆర్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు .. ఇక ఆ తరువాత వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ లో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో కనపడ్డాడు , ఈ లుక్ కి ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఇక 2018 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో యాక్షన్ మూవీ అరవింద సమేత వీర రాఘవ సినిమా లో ఇంట్రొడక్షన్ ఫైట్ లో ఎన్టీఆర్ మల్లి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు .. అరవింద సమేత వీర రాఘవ మూవీ తరువాత , ఎన్టీఆర్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ రాజమౌళి తో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేసాడు , ఈ మూవీ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించాడు , ఇక ఫిక్షన్ మూవీ గా తెరెకెక్కిన ఈ మూవీ కోసం ఎన్టీర్ మేకోవర్ విషయంలో చాలా శ్రద్ద తీసుకున్నాడు , అలానే ఈ కొమరం భీమ్ లుక్ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డాడు , ఇక రాజమౌళి స్టైలింగ్ , లుక్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు , ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం ఎన్టీఆర్ కొమురం భీముడి గెటప్ కోసం కాస్త బరువు తగ్గినట్లు తెలుస్తుంది ..ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ప్రాణం పెట్టి వర్క్ చేశారు .. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారు .

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు , దీని తరువాత కొంత బ్రేక తీసుకొని డైరక్టెర్ కొరటాల శివ డైరెక్షన్ లో 30 వ సినిమా చేస్తున్నాడు , ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ జనతా గ్యారేజ్ లో తారక్ చాలా సింపుల్ లుక్ లో కనబడ్డాడు .. డైరెక్టర్ రాజమౌళి మూవీ హాంగ్ ఓవర్ నుండి బయటకు రావాలన్న , ఆ మేకోవర్ నుండి బయటకు రావాలన్న తారక్ కు కొంత ఎక్కువ సమయం పడుతుంది .. ఆర్ ఆర్ ఆర్ మూవీ కంప్లీట్ అయినాక తారక్ మరి కాస్త బరువు పెరిగినట్లుగా తెలుస్తుంది . రీసెంట్‌గా త్రివిక్రమ్ మూవీ లో ఫైట్‌ సీక్వెన్సెస్‌లో షర్ట్‌లెస్‌గా కనిపించి సిక్స్‌ ప్యాక్‌ హీరో అనిపించుకున్నారు ఎన్టీఆర్. అంతకుముందు జనతాగ్యారేజ్‌ మూవీ లో అయితే చాలా నార్మల్ లుక్స్ లో కనిపించారు … ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 30 వ మూవీ కోసం డైరక్టెర్ కొరటాల శివ కు చాలా పెద్ద బాధ్యత ఏర్పడింది . కొరటాల శివ మూవీ స్ లో హీరోస్ లుక్స్ చాలా డీసెంట్ గా ఉంటాయి , అలానే ఎన్టీఆర్ 30 వ సినిమా అవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్ మీద ఇంకాస్త ఎక్కువ అంచనాలే ఉంటాయి ఇక ఈ మూవీ కోసం డైరెక్టర్ కొరటాల సూచన మేరకు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాడు ……. మొత్తానికి యంగ్ టైగెర్ ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం మేకోవర్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు గా తెలుస్తుంది .. అలానే డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ మేకోవర్ విషయంలో ఎలాంటి మార్పులు చేస్తాడో లుక్ ఎలా ఉండబోతుందో అనే విషయం తెలియాలంటే ఫస్ట్ లుక్ వచ్చేంతవరకు ఎదురు చుడాలిసిందే …