ఎన్టీఆర్ – కొరటాల శివ లేటెస్ట్ అప్ డేట్
ఎన్టీఆర్ 30 వ సినిమా లేటెస్ట్ అప్ డేట్
కొరటాల శివ – ఎన్టీఆర్ సినిమా లేటెస్ట్ న్యూస్ ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అరవింద సమేత వీర రాఘవ” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెట్ హిట్ అందుకుంది .. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి , అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా మేకింగ్ విషయం లోను డైరెక్టర్ రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని సోషల్ మీడియా లో విపిరీతమైన చర్చ నడుస్తుంది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత తారక్ , త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి . తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు , వాటిలో త్రివిక్రమ్ , కొరటాల శివ , మరియు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నారు అని పలు కామెంట్స్ వినిపించాయి .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం అంటూ దాదాపుగా రెండున్నర మూడు ఏళ్లుగా మరే ప్రాజెక్ట్ ను కూడా సెట్ చేసుకోలేదు ..అయితే ఆర్ ఆర్ ఆర్ లో చేసిన మరో హీరో రామ్ చరణ్ మాత్రం మద్యలో ఆచార్య సినిమాను చేశాడు. రామ్ చరణ్ ఆచార్య సినిమా తరువాత పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎనౌన్స్ చేసాడు .
శంకర్ సినిమా తరువాత డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక సినిమా ఎనౌన్సుమెంట్ చేసాడు .గౌతమ్ తిన్ననూరి తో సినిమా పూర్తి కాగానే ఆ తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ల కాంబోలో సినిమా ఉండబోతున్నట్లుగా కూడా సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాల తరువాత వరుసగా సినిమాలు లైన్ లో పెడుతుంటే , ఎన్టీఆర్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత తన తదుపరి సినిమా విషయం అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించబోతున్న 30వ సినిమాకు గాను త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడు అంటూ మొదట అధికారిక ప్రకటన వచ్చింది, ఆ తరువాత కొన్ని కొన్ని కారణాల వల్ల కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. . కొరటాల శివ బర్త్ డే సందర్బంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు ఎన్టీఆర్ 30 చిత్ర దర్శకుడు కొరటాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ 30 వ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులు బాధపడుతున్నారు .. అయితే దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమా వల్ల చాలా కాలం పాటు స్ట్రక్ అయ్యాడు. అలాగే ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ వల్ల సినిమా పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి , ఇద్దరు వెంటనే తమ కాంబో సినిమాను మొదలు పెట్టాలి. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో ఎప్పుడు మొదలవుతున్నది అనే విషయం మీద పూర్తిగా క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు అగ్గలిసిందే