పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ …

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ – ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అరవింద సమేత వీర రాఘవ” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెట్ హిట్ అందుకుంది .. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చేసి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి , అందులోనూ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా మేకింగ్ విషయం లోను డైరెక్టర్ రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు , , ప్రస్తుతము డైరెక్టర్ కొరటాల శివ మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు .. కొరటాల శివ ది – ఎన్టీఆర్ ది హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . కొరటాల శివ సినిమా అంటే ఎదో కొత్తదనం ఉంటుంది మరియు మెసేజ్ కూడా ఉంటుంది .. ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ , మరియు కొరటాల శివ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ , గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి , బృందావనం సినిమాలకు కొరటాల శివ డైలాగ్స్ అందించారు ..

కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది . ప్రస్తుతం యంగ్ టైగెర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఫుల్ బిజీగా ఉన్నారు , ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది , జనవరి తరువాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు , ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది .. ఎన్టీఆర్ కోసం డైరెక్టర్ కొరటాల శివ ఈ సారి పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారు , జనతా గ్యారేజ్ లో ఓ రేంజ్ లో తారక్ ను చూపించిన కొరటాల శివ మరి ఈ సినిమాలో తారక్ ని ఎలా చూపిస్తారో అని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ సినిమా , స్టూడెంట్స్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే చిత్రమిదని , మరియు కొరటాల మార్క్ క్లాసీ టచ్ తెరపై కనిపించనుందని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి ..ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ , సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ , మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు .. ఈ సినిమాను 2022 ఫిబ్రవరి లో పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నారు , మొత్తానికి , డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నది అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి …