నితిన్ ని లైన్ లో పెట్టిన వక్కంతం వంశీ…

భీష్మ మూవీ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌ తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్‌ హీరో నితిన్‌ . ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నాడు .. ఈ మూవీ తో పక్కగా హిట్ అందుకుంటాను అని కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తుంది .. ఈ మూవీ కి సంబంధించి షూటింగ్ చాలా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది .. ఇక రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి టీజర్ చిన్న రిలీజ్ చేయగా ఈ టీజర్ పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఇక అసలు విషయానికి వెళితే .. నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మరొక సిlనిమాను లైన్ లో పెట్టాడు ..నితిన్ సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతుంది .. ఒక్క హిట్ అందుకోవడం కోసం తెగ కష్టపడుతున్నాడు , భీష్మ మూవీ హిట్ తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాచర్ల నియోజకవర్గం మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .. ఈ మూవీ టీజర్ లో నితిన్ మాస్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు .. మాచర్ల నియోజకవర్గం సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే నితిన్ చాలా స్టోరీస్ వింటున్నాడు …

వక్కంతం వంశీ చెప్పిన స్టోరీ విని , గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు .. ..2018 లో డైరెక్టర్ వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా మారారు .. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది … ఈ మూవీ తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఏజెంట్ మూవీకి స్టోరీ అందిస్తున్నారు . ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ సక్సెస్‌ బాట పట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే మరో సినిమాను మొదలుపెట్టేశాడీ యంగ్‌ హీరో. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఇక ఈ మూవీ లో నితిన్‌ను జోడిగా పెళ్లిసందD ఫేమ్‌ శ్రీలీలా నటిస్తోంది. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్‌రావు క్లాప్‌ కొట్టగా.. ఆదిత్యా మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రొడక్షన్‌ నెంబర్‌ 9 పేరుతో ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమా అన్ని కమర్షియల్‌ హంగులు కలబోసినదని, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీ.. నితిన్‌ సరికొత్తగా చూపించబోతున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

నితిన్‌ ప్రస్తుతం హీరోగా తెరకెక్కుతోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అసలు విషయానికి వెళ్ళితే .. వక్కంతం వంశీ కెరీర్ గ్రాఫ్ చూసినట్లు అయితే , రైటర్ గా చేసిన మూవీస్ ఎక్కువ విజయాన్ని అందించాయి .. ప్రస్తుతం వక్కంతం వంశీ చేతిలో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి , వాటిలో ఏజెంట్ మూవీ ఒకటి , నితిన్ మూవీ ఒకటి , మరొకటి పవన్ మూవీ , అయితే ముందుగా యంగ్ హీరో నితిన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు .. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ లో కాస్టింగ్ ఎవరు ? , ఈ మూవీ లో నితిన్ ఎలాంటి రోల్ లో నటించబోతున్నాడు ?? అనే విషయాలు త్వరలో తెలుస్తాయి .. ఇక నితిన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైన్ లో పెడుతున్డుl , అలానే కెరీర్ లో కాస్త వెనుక పడిన నితిన్ ఈ మూవీస్ తో హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కాలని తెగ ప్రయత్నిస్తున్నాడు…