మాచర్ల నియోజక వర్గం ఇంచార్జ్ గా హీరో నితిన్ …

మార్చి 26న ఛార్జ్ తీసుకొనున్న నితిన్... 

భీష్మ మూవీ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌ తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్‌ హీరో నితిన్‌,, కాని భీష్మ రేంజ్‌ హిట్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాడు.నితిన్ చేసిన చెక్‌, రంగ్‌ దే మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలని మాస్ట్రో లుక్‌ లోకి మారాడు నితిన్‌. బాలీవుడ్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ అంధాధున్‌కు తెలుగు రీమేక్‌ గా మాస్ట్రో మూవీ తెరకెక్కింది . తొలిసారి నితిన్‌ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రోపై అంచనాలు పెరిగాయి. మహమ్మారి కరోనా కారణంగా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కాలేక ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది .. ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకుంది ….

ఇక అసలు విషయానికి వెళ్ళితే …….. మాస్ట్రో మూవీ తో డీసెంట్ హిట్ అందుకున్న నితిన్ , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో
మాచర్ల నియోజకవర్గం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు … ఈ మూవీ తో ఎస్ రాజ శేఖర్ రెడ్డి డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి పరిచయం అవుతున్నారు .. ఇక ఈ మూవీ
హీరో నితిన్ సరసన కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీని ఆదిత్య మూవీస్.. ఎంటర్‌టైన్‌మెంట్స్‌‏తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ షూటింగ్ భారీ షెడ్యూల్‌‏ను కంప్లీట్ చేసుకుంది .. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్.. టీజర్ త్వరలో రిలీజ్ కాబోతున్నాయంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి …….. ఈ నేపధ్యం లో మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది …ఇక ఈ మూవీ లో ఫైట్ సీన్స్ ఫైట్ మాస్ట‌ర్ అనల్ అరసు నేతృత్వం‌లో తెరకెక్కుతుంది .. . ఈ సంద‌ర్భంగా మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి ఫస్ట్ లుక్‌‏కి తో మూవీ టీమ్ ముందుకు వచ్చింది ..ఇక కాస్త డిఫెరెంట్ మార్చి 26న ఫస్ట్ ఛార్జ్ తీసుకోబోతున్న‌ట్లుగా కాస్త డిఫెరెంట్ గా ప్రకటన విడుద‌ల చేశారు మూవీ టీమ్ .

శ్రీ ఎన్ . సిద్ధార్థరెడ్డి, IAS (2022) గుంటూరు జిల్లా కలెక్టర్‌గా అపాయింట్ అయ్యారు .ఇక తన మొదటి ఛార్జ్‌ని మార్చి 26న ఉదయం 10:08 గంటలకు తీసుకుంటున్నారు. అంటూ ఆర్డ‌ర్ కాపీలో పేర్కొన్నారు. గుంటూరులో జిల్లా కలెక్టర్‌ గా హీరో నితిన్ ఎదుర్కోబోతున్న సవాళ్లను ఈ కాపీ లో ఉంది .. మొత్తానికి నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం మూవీ నుండి ఇంట్రస్టింగ్ అప్ డేట్ రావడంతో నితిన్ రోల్ ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు …