‘జెర్సీ ‘ డైరెక్టర్ తో రామ్ చరణ్ కొత్త సినిమా రామ్ చరణ్ సినిమా అఫీషియల్ ఎనౌన్సుమెంట్

రామ్ చరణ్ – బోయాపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా “వినయ విధేయ రామ” .. రంగస్థలం సినిమా తో భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ , ఆ తరువాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కలిసి వినయ విధేయ రామ సినిమా చేశారు .. పవర్ ఫుల్ స్టోరీ , మాస్ ఎలెమెంట్స్ , ఫ్యామిలీ ఎమోషన్స్ , బోయపాటి శ్రీను టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది గాని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది .. “వినయ విధేయ రామ” సినిమా తరువాత రామ్ చరణ్రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా గా ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు .. బాహుబలి సినిమా తరువాత , రాజమౌళి , ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నారు అని సోషల్ మీడియా లో విపరీతమైన బజ్ ఏర్పడింది ..ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ..రామ్ చరణ్ శంకర్ సినిమా లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయింది .. నానితో జెర్సీ సినిమాను తెరకెక్కించి జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీ జెర్సీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి తెలుగు లో రామ్ చరణ్ హీరోగా ఒక భారీ సినిమాను చేయబోతున్నట్లుగా చాలా నెలలుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. రామ్ చరణ్ ఇటీవల శంకర్ సినిమాకు ఓకే చెప్పడంతో పాటు ఇతర కారణాల వల్ల వీరిద్దరి కాంబో సినిమా ఉంటుందా లేదా అనే వార్తలు వస్తున్నాయి ..ఇలాంటి సమయంలో అనూహ్యంగా రామ్ చరణ్ తదుపరి సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది ..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు సర్ ప్రైజ్ అయ్యారు. గౌతమ్ తిన్ననూరి ఒక వైవిధ్యభరిత కథనురామ్ చరణ్ కు చెప్పి ఒప్పించాడు. ఆ కథ నానితో రూపొందించిన జెర్సీ సినిమా తరహాలోనే చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది ..రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. . ఇక శంకర్ తో సినిమాను ఈ నెలలోనే చరణ్ పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు. శంకర్ మూవీ ముగిసిన వెంటనే గౌతమ్ తిన్ననూరి మూవీ లో రామ్ చరణ్ జాయిన్ అవుతారు . రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చెయడం మెగా అభిమానులకు గుడ్ న్యూస్

Leave a Reply