ఫుట్‌బాల్ టోర్నమెంట్ లో సత్తా చాటిన నాసర్ బాయ్స్ స్కూల్ స్టూడెంట్స్

తెలుగు సూపర్ న్యూస్, జూన్ 12,2023: నాసర్(NASR) బాయ్స్ స్కూల్ లోని ఫుట్‌బాల్ గ్రౌండ్ లో అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మూడురోజులపాటు జరిగిన ఈ టోర్నమెంట్ లో హైదరాబాద్ నగరంలోని పలు స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 9వతేదీన జరిగిన అండర్ 19 బాయ్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ లో విద్యార్థులు అదరగొట్టారు. లీగ్ మ్యాచ్‌లు మొత్తం 5 జట్లు ఆడాయి. ఇందులో సెమీ ఫైనల్ HPS బేగంపేట vs ఫ్యూచర్ కిడ్స్ జట్లు తలపడగా ఈ మ్యాచ్‌లో హెచ్‌పీఎస్‌ 1-0తో విజయం సాధించింది. 2వ సెమీ ఫైనల్ లయోలా గుంటూరు vs సెయింట్ ఆన్స్ స్కూల్ ఈ మ్యాచ్‌లో లయోలా గుంటూరు జట్టు 3-0తో విజయం సాధించింది. 3వ ప్లేస్..లో ఫ్యూచర్ కిడ్స్ vs సెయింట్ ఆన్స్ తలపడగా ఇందులో 3+0తోఫ్యూచర్ కిడ్స్ మ్యాచ్ గెలిచారు.

ఫైనల్ మ్యాచ్..లో లయోలా గుంటూరు vs HPS బేగంపేట జట్లు తలపడగా ఈ మ్యాచ్‌లో లయోలా గుంటూరు జట్టు 1-0తో విజయం సాధించింది. GMC బాలయోగి స్టేడియంలో ఆగస్ట్ నెలాఖరులో ఈ టోర్నమెంట్‌ లో గెలిచిన విజేతలకు బహుమతులు అందిస్తారు. జూన్ 10వతేదీన జరిగిన అండర్ 17 ఫుట్‌బాల్ మ్యాచ్‌ లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. 1 సెమీ ఫైనల్ మ్యాచ్ లో నాసర్ బాయ్స్ స్కూల్ vs HPS బేగంపేట జట్లు ఆడాయి. 2 సెమీ ఫైనల్ లో ఫ్యూచర్ కిడ్స్ (నానక్ రామ్ గూడ) vs ఇంటర్నేషనల్ స్కూల్ (షేక్ పేట్), 1వ సెమీ ఫైనల్ మ్యాచ్ నాసర్ బాయ్స్ స్కూల్ vs HPS బేగంపేట జట్లు ఆడగా ఈ మ్యాచ్‌లో నాసర్ బాయ్స్ స్కూల్ 1-0తో విజయం సాధించింది.

2 సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఫ్యూచర్ కిడ్స్ vs ఇంటర్నేషనల్ స్కూల్ షేక్ పేట్ 5 -4తో ఫ్యూచర్ కిడ్స్ జట్టు గెలిచింది. 3వ ప్లేస్ లో ఇంటర్నేషనల్ స్కూల్ (షేక్ పేట్) మ్యాచ్ (పెనాల్టీ షౌట్) 7- 6తో గెలిచింది. ఫైనల్ మ్యాచ్ లో నాసర్ బాయ్స్ స్కూల్ vs ఫ్యూచర్ కిడ్స్ (నానక్ రామ్ గూడ) జట్లు ఆడగా ఫ్యూచర్ కిడ్స్ (నానక్ రామ్ గూడ) 2-1తో విజయం సాధించింది. జూన్ 11వతేదీన అండర్19 ఫుట్‌బాల్ మ్యాచ్‌ లో మొత్తం 7టీమ్స్ పాల్గొన్నాయి. ఇది సుబ్రథో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ CISCE AP/TS ఫుట్‌బాల్ మ్యాచ్. ఆదివారం లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇందులో సెమీ ఫైనల్స్ లో నాసర్ బాయ్స్ స్కూల్ vs లయోలా స్కూల్ (గుంటూరు), ది ఫ్యూచర్ కిడ్స్ (నానక్ రామ్‌గూడ) vs HPS (బేగంపేట) జట్లు పాల్గొన్నాయి.

1వ సెమీ ఫైనల్ మ్యాచ్ లో (పెనాల్టీ షూటౌట్)లో హెచ్‌పీఎస్ (బేగంపేట) 4-3తో విజయం సాధించింది. 2 సెమీ ఫైనల్ నాసర్ బాయ్స్ స్కూల్ vs లయోలా స్కూల్ గుంటూరు, నాసర్ బాయ్స్ స్కూల్ 5-3తో మ్యాచ్ (పనాల్టీ షౌట్) గెలిచింది.ఫైనల్ మ్యాచ్ లో నాసర్ బాయ్స్ స్కూల్ vs HPS బేగంపేట జట్లు తలపడగా మ్యాచ్ పెనాల్టీ షౌట్‌అవుట్‌ను 8- 7తో HPS గెలుచుకుంది. అండర్ 14 ఫుట్ బాల్ బాయ్స్ టోర్నమెంట్ లో హెచ్‌పిఎస్ బేగంపేట జట్టు విజేతగా నిలవగా, రన్నర్ గా NASR బాయ్స్ స్కూల్ నిలిచింది. కాగా తృతీయ స్థానంలో ఫ్యూచర్ కిడ్స్ నానక్ రామ్ గూడ జట్టు నిలిచింది.

Leave a Reply