డైలమాలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని…

కన్ఫ్యూజన్ లో ఉన్న న్యాచురల్ స్టార్..

           
          

న్యాచురల్ స్టార్ నాని – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా “వి “.. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ మరియు నాని యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది గాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయింది , “వి ” సినిమా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది ..” వి ” సినిమా తరువాత నాని డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో టక్ జగదీశ్ సినిమా లో నటించారు , వీరిద్దరిది హిట్ కాంబినేషన్ , గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నుకోరి సినిమా సూపర్ హిట్ అయింది . టక్ జగదీశ్ సినిమా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ అయింది .ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని , బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం యావేరేజ్ టాక్ తెచ్చుకుంది .. వి సినిమా , మరియు టక్ జగదీష్ సినిమాలు రెండు ఓటీటీలోనే రిలీజ్ అవుతుండటంతో తన నెక్స్ట్ సినిమా `శ్యామ్ సింగరాయ్‌ థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యేలాగా చూస్తున్నారు.. శ్యామ్ సింగరాయ్‌ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది , ఈ మూవీ డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తాజాగా శ్యామ్ సింగరాయ్‌ సినిమా గురించి సోషల్ మీడియా లో ఒక వార్త హల్ చల్ చేస్తుంది ..శ్యామ్ సింగ్‌రాయ్‌ సినిమాకు పోటీగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా రెడీ గా ఉంది .. దీంతో గని సినిమా ఎఫెక్ట్ శ్యామ్ సింగ రాయ్ సినిమా కలెక్షన్స్‌ పై పడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు .. గని సినిమా నే కాకుండా నాని కు మరో సినిమా తల నొప్పిగా మారింది ఆ సినిమానే 83 ..1983లో భారత జట్టు అండర్ డాగ్‌గా బరిలోకి దిగి సంచలన రీతిలో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది .

ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 24న హిందీతో పాటుగా సౌత్ లో అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. . అందుకే నాని మరియు మూవీ టీమ్ శ్యామ్ సింగరాయ్‌ సినిమా రిలీజ్ విషయంలో కాస్త డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది ..అఖండ సినిమా తో ధియేటర్స్ లో గట్టి సందడి నెలకొంది , ప్రస్తుతం అన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి , ఈ నేపథ్యంలో నాని నటించిన శ్యామ్ సింగరాయ్‌ సినిమా రిలీజ్ పై సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు పై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …