నాగోల్ పల్లవి ఇంజినీరింగ్ కాలేజీకి లభించిన స్వయంప్రతిపత్తి హోదా..

తెలుగు సూపర్ న్యూస్,నాగోల్,ఫిబ్రవరి 9,2024:యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (UGC) 2024, ఫిబ్రవరి, 8న ఈ హోదాను పీఈసీకి అందించింది. ఈ హోదా A.Y.2024-25 నుంచి వర్తిస్తుంది. అలాగే ఇది వచ్చే 10 సంవత్సరాల పాటు చెల్లుతుందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.

         ఈ సందర్భంగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ మల్కా కొమరయ్య, సీఈఓ మల్కా యశస్వి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. నవీన్ కుమార్, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్. ఎం. బి. రాజు ఇంతటి గొప్ప హోదాను సాధించేందుకు తమ సహాయ సహకారాలు అందించిన భాగస్వాములందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు. 

చైర్మన్ మల్కా కొమరయ్య మాట్లాడుతూ.. ‘‘పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ గత 30 ఏళ్లుగా విద్యారంగంలో అగ్రగామిగా నిలుస్తూ.. విలువలతో కూడిన విద్యను అందిస్తోంది. ఐదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, 13 పల్లవి స్కూల్స్, ఇంజినీరింగ్ మరియు డిగ్రీ కాలేజీలతో మేమెప్పుడూ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

ముఖ్యంగా పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ కి ఇప్పుడు స్వయంప్రతిపత్తి హోదా రావడం ఎంతో ఆనందంగా ఉంది. దానికి కాలేజీ టీమ్ బాగా శ్రమించింది. మొత్తం 11 బ్యాచీల విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టా అందుకుని ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ప్రతి ఏడాది 180 మంది విద్యార్థుల్లో దాదాపు 140కి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్ అందిస్తున్నామని గొప్పగా చెప్పగలుగుతున్నామ’’ని అన్నారు.

       భవిష్యత్ లో ఎన్బీఏ ద్వారా గుర్తింపు తెచ్చుకునేందుకు బాగా కృషి చేస్తున్నామని, 2024-25 లోపే పల్లవి యూనివర్సిటీని తయారు చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. ప్రస్తుతం స్వయంప్రతిపత్తి హోదా సాధించడంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన ప్లేస్మెంట్ డైరెక్టర్ శ్రీమతి కె. సుమేధా రమేష్, ఏఓ శ్రీధర్, మేనేజ్మెంట్ రిప్రెజెంటేటివ్ ఎం.రాజేందర్ రెడ్డి, అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్, సిబ్బందికి చైర్మన్ మల్కా కొమరయ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply