లవ్ స్టోరీ సినిమా తరువాత రూట్ మార్చిన నాగ చైతన్య…

కొత్తదనం కోరుకుంటున్న నాగ చైతన్య...

మన టాలీవుడ్ యంగ్ హీరోల్లో అక్కినేని నాగ చైతన్య కు లేడీస్ ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ గానే ఉంది .. నాగ చైతన్య సీని కెరీర్ కనుక చూసుకున్నట్లు అయితే రొటీన్ సినిమాలకు మాస్ సినిమాలకు దూరంగా ఉంటూ , తన ప్రతి సినిమాలోనూ ఎదో కొత్త ధనం చూపించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు .. అక్కినేని ఫ్యామిలీకి కలిసొచ్చిన రొమాంటిక్ సినిమాలు చేసి కింగ్ నాగార్జున లెగసీ ని కంటిన్యూ చేసారు .. మొదటి సినిమా జోష్ నుండి చివరి సినిమా లవ్ స్టోరీ దాకా అన్ని ప్రేమ కధలే ఎక్కువ గా ఉన్నాయి ..మొదటి సినిమా జోష్ ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది .. జోష్ సినిమా తరువాత నాగ చైతన్య , డైరెక్టర్ – గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్షన్ లో ‘ఏ మాయ చేశావె సినిమా చేశారు , ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ..నాగ చైతన్య సినీ కెరీర్ నే కాదు, లైఫ్ నూ మలుపు తిప్పిన చిత్రంగా ‘ఏ మాయ చేశావె’ సినిమా నిలచిపోయింది. ‘ఏ మాయ చేశావె’ సినిమా తరువాత డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘100 పర్సెంట్ లవ్ సినిమాలో నటించాడు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది . .‘100 పర్సెంట్ లవ్ సినిమా తరువాత వచ్చిన మనం సినిమా నాగచైతన్య కు ఎంతో స్పెషల్ ..నాగ చైతన్య కెరీర్ లో వచ్చిన “ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మహానటి, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ” వంటి సినిమాలు తన స్టోరీ సెలెక్షన్ క్యాలిబర్ ని ప్రూవ్ చేసింది .

నాగ చైతన్య – డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్స్ ,సాంగ్స్ , టీజర్స్ తో మరియు నాగ చైతన్య యాక్టింగ్ , తో ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు , లవ్ స్టోరీ సినిమా రిజల్ట్ తో నాగ చైతన్య కు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి తన స్టోరీ సెలెక్షన్ లో రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం నాగ చైతన్య బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ ఛద్దా’లో నాగచైతన్య స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు ..ఈ సినిమాతో పాటు కింగ్ నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’ సినిమా లోనూ నటిస్తున్నారు. ‘బంగార్రాజు’ సినిమా తరువాత డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యూ సినిమాలో లైన్ లో ఉంది .. ‘లాల్ సింగ్ ఛద్దా , ‘బంగార్రాజు , ‘థ్యాంక్ యూ సినిమాల్లో నాగ చైతన్యు క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది అని ఇటీవలే నాగ చైతన్య తెలిపారు .. మొత్తానికి ఈ మూడు సినిమాలు నాగ చైతన్య కెరీర్ లో చాలా కొత్తదనం తో ఉంటాయి అని తెలుస్తుంది ..