రాష్ట్ర స్థాయి సదస్సుకు వేదిక కానున్న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్..

తెలుగు సూపర్ న్యూస్,జూన్ 10,2023: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించిన ప్రకారం, భారతదేశం G-20 అజ్యూమ్డ్ ప్రెసిడెన్సీగా బాధ్యతలు స్వీకరించింది.

ఈ సందర్భంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ (FLN)పై నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో జూన్ 14న సీబీఎస్సీ నేతృత్వంలోని ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వక్తలు FLN, NEP అండ్ G20 థీమ్‌లపై ప్రసంగిస్తూ అవగాహన కల్పిస్తారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఎన్ స్టేషన్లు, ఎఫ్‌ఎల్‌ఎన్ టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఎఫ్‌ఎల్‌ఎన్ స్టోరీ బూత్ క్రియేషన్, స్కూళ్లలోని జనభాగిదారి వంటి కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ విద్యాశాఖ ప్రతినిధులు హాజరుకానున్నారు.

పాఠశాల గతంలో చేపట్టిన వివిధ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యకలాపాలను సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీమతి సునీతరావు వివరిస్తూ, ప్రతిష్టాత్మకమైన సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి తమ పాఠశాల సన్నద్ధమైందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది.

Leave a Reply