నాగోల్ కుంట్లూరులోని పల్లవి ఇంజినీరింగ్ కాలేజీకి న్యాక్ ‘A’ గ్రేడ్‌..

తెలుగు సూపర్ న్యూస్,నాగోల్ ,ఆగష్టు 26,2023:నాగోల్ కుంట్లూరులోని పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ (PEC) 2023, ఆగస్ట్ 21న ఐదు సంవత్సరాల కాలానికి న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ద్వారా ‘A’ గ్రేడ్తో గుర్తింపు పొందింది.ఈ సందర్భంగా గౌరవనీయులైన పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్కా కొమరయ్య, సీఓఓ మల్కా యశస్వి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం. నవీన్, డైరెక్టర్ డాక్టర్ J.గోవర్ధన్, ప్రిన్సిపాల్ డాక్టర్ M.B.రాజు ఈ గౌరవాన్ని సాధించడంలో తమ మద్దతు మరియు సహకారాన్ని అందించారు. ఈ విజయాన్ని సాధించడంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించిన ప్లేస్ మెంట్స్ డైరెక్టర్ సుమేధా రమేష్, అన్ని డిపార్ట్ మెంట్ల HODలు, AO శ్రీధర్, Mgmt Rep M.రాజేందర్ రెడ్డి, ఇతర సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసింది కాలేజీ యాజమాన్యం.

గత ముప్ఫై ఏళ్లుగా పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ విద్యారంగంలో నిరంతర సేవలందిస్తోంది. ఈ గ్రూప్ కింద మొత్తం ఐదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, 13 పల్లవి ఇంటర్నేషనల్ , మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగూ డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలతో ఈ సంస్థ కేజీ టూ పీజీ అకడమిక్స్ ని కొనసాగిస్తోంది.

పల్లవి ఇంజినీరింగ్ కాలేజ్ : పల్లవి ఇంజినీరింగ్ కళాశాల 2009లో సమర్థ నిపుణులను తయారు చేయాలనే లక్ష్యంతో స్థాపించబడింది. ఈ కళాశాల ప్రారంభం నుంచి భారీ పురోగతిని సాధించింది. ఇప్పుడది హైదరాబాద్ జంట నగరాల్లోని ప్రధాన సంస్థలలో ఒకటిగా గుర్తింపును సాధించింది.
పల్లవి గ్రూప్ చైర్మన్ శ్రీ మల్కా కొమరయ్య ఒక విద్యావేత్తగా, నాయకుడిగా విద్యాసంస్థలను స్థాపించడంలో, భావి పౌరుల సమగ్ర అభివృద్ధికి మార్గాలను సుగమం చేశానే. తన సుసంపన్నమైన నైపుణ్యంతో విద్యాసంస్థలన్నిటినీ విజయవంతంగా నడిపిస్తున్నారాయన.

పల్లవి ఇంజినీరింగ్ కాలేజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Dr.M.నవీన్ కుమార్ ప్రఖ్యాత దార్శనికుడు. విద్యుత్ రంగంలో ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్లలో ఆవిష్కరణ, సమీకృత అభ్యాసంపై దృష్టి సారించడానికి గొప్ప పారిశ్రామిక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారాయన.
ఈ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్న Dr.M.B.రాజు మరియు డైరెక్టర్గా ఉన్న Dr.J.గోవర్ధన్ అపారమైన బోధన మరియు పరిశోధన అనుభవంతో ఉన్నారు.

కళాశాల అందించే కోర్సులు:

UG:

  1. సివిల్ ఇంజినీరింగ్- 30 సీట్లు
  2. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ – 60 సీట్లు
  3. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 30 సీట్లు
  4. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE)-120 సీట్లు
  5. CSE – సైబర్ సెక్యూరిటీ (CSC)-60 సీట్లు
  6. CSE- డేటా సైన్స్ (CSD)-60 సీట్లు
  7. CSE- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ (CSM)-60 సీట్లు

PG:
MBA(మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్) – 120 సీట్లు

అడ్మిషన్ల గ్రాఫ్:
ప్రతి సంవత్సరం 80 నుంచి 90 % ప్రవేశ నిష్పత్తిని విజయవంతంగా సాధించడం.
ఫలితాలు:
సగటు ఉత్తీర్ణత శాతం 70-75 %తో మొత్తం 11 బ్యాచ్లు విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాయి.
నియామకాలు:
ప్రస్తుత సంవత్సరంలో ప్లేస్మెంట్ల సంఖ్య.. 150 మంది అభ్యర్థులలో 120 మంది విద్యార్థులు ఉన్నారు.

అత్యధిక ప్యాకేజీ 13 LPA (ECE డిపార్ట్మెంట్ నుంచి కశ్యప్), బోస్టన్ IT సొల్యూషన్స్ నుంచి 9 LPA – 30, TCS,Capegemini,Accenure,IBM,Tech Mahindra, WIPRO, Mariadda , Aparna Constructions,ECLAT, అనేక ఇతర ప్రసిద్ధ MNCలు విద్యార్థులకు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు అందిస్తున్నాయి.

ఆరొప్రో, బోస్టన్ ఐటీ సోల్, మ్యారీఅడ్డాలో మొత్తం 10 ప్లేస్ మెంట్స్ అయ్యాయి. అందులో అధికంగా ఏడాదికి 13లక్షల ప్యాకేజీ, అత్యల్పంగా 2.4 లక్షల ప్యాకేజీ అందింది. టీసీఎస్ లో ఐదు ప్లేస్ మెంట్స్ అయ్యాయి. అందులో అత్యధికంగా 3.6లక్షలు, అత్యల్పంగా 2.4 లక్షల ప్యాకేజీలు విద్యార్థులకు లభించాయి.

జెన్ ట్రీ ల్యాబ్స్ లో ఐదు ప్లేస్ మెంట్స్ అయ్యాయి. అందులో ఏడాదికి 3.5 లక్షల ప్యాకేజీ, అత్యల్పంగా 2.4 లక్షల ప్యాకేజీ అందింది. క్యూస్పైడర్స్ లో ఆరు ప్లేస్ మెంట్స్ అయ్యాయి. అందులో అత్యధిక ప్యాకేజీ 2.4 లక్షలు కాగా అత్యల్పంగా 2.4 లక్షల ప్యాకేజీగా అందించాయి.

భవిష్యత్ కార్యాచరణలు:

2024-25 విద్యా సంవత్సరానికి UGC ద్వారా “ఆటోనామస్ (స్వయంప్రతిపత్తి)” హోదాతో మరియు NBA ద్వారా అక్రిడిటేషన్తో కాలేజీ నడిచేలా చేయాలన్న లక్ష్యంతో ఉంది. సమీప భవిష్యత్తులో ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని కూడా ఆలోచిస్తోంది.

PEC యొక్క ప్రధాన లక్ష్యం.. విలువ ఆధారిత నాణ్యమైన విద్యతో సమాజానికి సేవ చేయడం. దీని ద్వారా విద్యార్థులు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా సంపూర్ణ సమర్థ వృత్తిపరమైన పౌరులుగా కూడా తయారవుతారు.

కాలేజీకి చెందిన ముఖ్య ప్రముఖులు :
మల్కా కొమరయ్య – చైర్మన్
మల్కా యశస్వి – సీఓఓ
డాక్టర్ మల్కా నవీన్ కుమార్ – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
డా. జె. గోవర్ధన్ – డైరెక్టర్
డాక్టర్ M.B.రాజు – ప్రిన్సిపాల్
శ్రీమతి సుమేధా రమేష్ కె – డైరెక్టర్ (శిక్షణ ,ప్లేస్మెంట్స్ & కార్పొరేట్ సంబంధాలు).

Leave a Reply