తిరుపతి లో మోహన్ బాబు యూనివర్సిటీ …

ప్రముఖ నటుడు మోహన్ బాబు సినీ రంగంలోనే కాదు విద్యారంగంలోనూ సేవలందిస్తున్నారు. తిరుపతిలో విద్యానికేతన్ సంస్థలు ఏర్పాటు చేసి 30 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్ ను అందించారు. తాజాగా మరో అడుగు ముందుకేసిన మోహన్ బాబు.. తిరుపతిలో తన పేరుతో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తల్లిదండ్రులు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు ప్రేమతో మోహన్ బాబు యూనివర్శిటీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ” శ్రీవిద్యానికేతన్ లో వేసిన విత్తనాలు మొలకెత్తి కల్పవక్షంగా మారాయి. మీ 30 ఏళ్ల నమ్మకం, నా జీవిత లక్ష్యం సాకారమయ్యే సమయం వచ్చింది. వినూత్న విద్యాభ్యాసానికి తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం. మీ ప్రేమే నా బలం. మీ మద్దతు ఎల్లప్పుడు ఇలాగే ఉంటుదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను”-

డాక్టర్ ఎం.మోహన్ బాబు