ఉగాది కానుకగా మహేష్ ఫ్యాన్స్ కు బిగ్ సర్‌ప్రైజ్‌…

లాస్ట్ ఇయర్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా లో నటిస్తున్నాడు .. గీత గోవిందం సినిమా తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరుశురామ్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు తో సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. బ్యాంక్ కుంభకోణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఇక ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .

ఈ మూవీ కి సంబంధించి ఫస్టు సింగిల్ గా వచ్చిన కళావతి’ పాట కు అత్యధిక వ్యూస్ వచ్చాయి .. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ గా ‘పెన్నీ’ సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. . మహేశ్ కూతురు సితార కూడా మెరిసిన ఈ సాంగ్ కూడా ఒక రేంజ్ లో దూకుడు చూపుతూ వెళుతోంది..ఇక అసలు విషయానికి వెళ్ళితే… . ఈ మూవీ నుండి టీజర్ , రెండు లిరికల్ సాంగ్స్ కాకుండా ఏ విధమైన అప్ డేట్ బయటకు రావడం లేదు .. మహేష్ బాబు కి కొంత కాలం ఆరోగ్యం బాగోలేనందువల్లన షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది .,. మల్లి తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంబించ్చారు .. అయితే సర్కారు వారి పాట సినిమా నుండి రోజు కు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. అయితే ఈ మూవీ నుండి ఎటువంటి అప్ డేట్ బయటకు రాకాపోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఆందోళపడుతున్నారు .. ఇక తాజాగా ‘ఉగాది’ కానుకగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రానుందనేది చాలా ఆసక్తికరంగా మారింది…