మహేష్ – త్రివిక్రమ్ కాంబో లో బుట్టబొమ్మ అవుట్ …

మహేష్, త్రివిక్రమ్ సినిమా తప్పుకున్న పూజ హెగ్డే...

మహేష్ బాబు – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లవచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిలేరు నీకెవ్వరు .. ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారు పాట అనే సినిమా లో నటిస్తున్నారు , ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్, మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు .. ఈ సినిమా పై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి . సర్కారు వారు పాట సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ రిలీజ్ చేయగా , వీటి పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది .సర్కారు వారి పాట మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. సర్కారు వారు పాట సినిమా తరువాత మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి ఎనౌన్సుమెంట్ చేస్తూ చిన్న గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు ..

మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు , మరియు ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ..వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి . తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయింది , ఈ సినిమాలో హీరో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా మొదట పూజా హెగ్డే అనుకున్నారు .. మహేష్ బాబు – పూజా హెగ్డే తో కలిసి మహర్షి సినిమాలో నటించారు , ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది .. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ , మరియు అల వైకుంఠపురములో రెండు సినిమాల్లోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజ నే సెలెక్ట్ చేశారు ..ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే కు వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి ,, ఈ నేపథ్యంలో మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లో పూజా హెగ్డే తప్పుకున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురు చుడాలిసిందే ..