సోషల్ మీడియా లో వైరల్ లేటెస్ట్ మహేష్ బాబు ఫొటోషూట్…

స్టైలిష్ లుక్ లో మెరిసిన ప్రిన్స్ మహేష్ బాబు..

మన టాలీవుడ్ హీరోల్లో మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు .. ఆరు అడుగుల ఎత్తు , అందం , మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ , డైలాగ్ డెలివరీ , యాక్షన్ సీన్స్ లో అన్నిటిలో చాలా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం చూపించడానికి బాగా ప్రయత్నిస్తారు .. మహేష్ బాబు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు యాడ్స్ చేస్తుంటారు .. సినిమాకు సినిమాకు మహేష్ బాబు తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు . మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు , ఈ సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు – డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్ లో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు . . ఈ సినిమాలో మహేష్ సరసన కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.మహేశ్ ఈ సారి స్టైలిష్ హెయిర్‌తో కనిపించి మరో సారి సందడి చేయబోతున్నాడు.

సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే #SSMB28 ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నాడు మహేశ్‌. ఈ క్రమంలో మహేష్ బాబు ఓ పక్క సినిమా చేస్తూనే మరో పక్క తాను యాడ్స్ చేయడానికి కొంత సమయం కేటాయిస్తారు ,తాజాగా మహేష్ బాబు పాల్గొన్న లేటెస్ట్ ఫొటోషూట్ స్టిల్‌ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది .. ఈ ఫోటోషూట్ లో మహేష్ బాబు కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో బైకుపై స్టైలిష్ మరియు రాయల్ గా కూర్చొని కెమెరా కి ఫోజులిచ్చాడు. ఈ ఫోటో షూట్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా యూత్ ని ఎట్ట్రాక్ట్ చేస్తున్నారు . ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో అయిన మహేశ్ న్యూ ఫోటో షూట్ స్టిల్ చూసి అభిమానులు సంతోషంగా ఉన్నారు ..
.