సినీనటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత…

ప్రముఖ నటుడు మహేశ్‌ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

1974 లో అల్లూరి సీతా రామరాజు సినిమా తో బాలనటుడు గా ఎంట్రీ… కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు కలసి నటించిన ముగ్గురు కొడుకులు సూపర్ హిట్ గా నిలిచింది. రమేష్ బాబు నటించిన సినిమా లలో సామ్రాట్, ముగ్గురు కొడుకులు, బజార్ రౌడీ ఎన్కౌంటర్ సూపర్ హిట్ సినిమాలు. కృష్ణ తో కలసి నటించిన ఎన్కౌంటర్ రమేష్ బాబు చివరి చిత్రం.1976లో వచ్చిన ఈ మూవీ లో సూర్యం పాత్రలో నటించారు.సూర్యవంశం (హిందీ), అర్జున్‌, అతిథి, దూకుడు చిత్రాలను నిర్మించిన రమేశ్‌బాబు..