మహాసముద్రం సినిమా రివ్యూ

“అర్జున్‌ రెడ్డి” సినిమా తరువాత టాలీవుడ్‌లో బోల్డ్ సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు . అర్జున్‌ రెడ్డి సినిమా తరువాత టాలీవుడ్‌ ఇండస్ట్రీ లో చాలా మార్పు వచ్చింది .. రామ్‌ గోపాల్ వర్మ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసిన అజయ్‌ భూపతి దర్శకుడిగా కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100 .. ఈ సినిమా టైటిల్‌ తో పాటు పోస్టర్స్‌, టీజర్స్‌ డిఫరెంట్‌గా ఉండటంతో సినిమా మీద భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగెస్ట్ హిట్ గా నిలిచింది .. బోల్డ్ కంటెంట్ , డిఫెరెంట్ జానర్ , మ్యూజిక్ , విలనిజం డిఫెరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమాను తెరకెక్కించి మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు అజయ్ భూపతి.. ఆర్‌ఎక్స్‌ 100 సినిమా తరువాత డైరెక్టర్ అజయ్‌ భూపతి కొంత గ్యాప్ తీసుకొని తన రెండో సినిమా గా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశ్యంతో ఎంతో వైవిధ్యమైన కథ, కథనాల్ని తెరకెక్కించిన సినిమా మహాసముద్రం.శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకులకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహా సముద్రం’ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కధ : ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే అర్జున్, విజయ్ లు ఇద్దరూ మంచి స్నేహితులు. హీరోకి మహాతో రిలేషన్ ఏర్పడుతుంది. వరుసగా జరిగే కొన్ని అనుకోని సంఘటనలతో విజయ్ సిటీ నుండి పారిపోవాల్సి వస్తుంది. తన ఆచూకీ కోసం అర్జున్ ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. అతను ఎక్కడున్నాడనేది కూడా ఎవరికీ తెలీదు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత విజయ్ తిరిగి వస్తాడు. అసలు విజయ్ పారిపోవడానికి, తిరిగి రావడానికి కారణాలేంటో.. అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తన ఫ్రెండ్ అయిన అర్జున్, విజయ్ కు ఏ విధంగా హెల్ప్ అయ్యాడనేది తెలియాలంటే మహా సముద్రం సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
డైరెక్టర్ అజయ్ భూపతి తను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు .. ఆర్‌ఎక్స్‌ 100 సినిమా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత , అజయ్ భూపతి మల్టీ స్టారర్ సినిమా గా మహా సముద్రం సినిమా ఎనౌన్స్ చేయడం .. ఈ సినిమా తో సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం , స్టార్ కాస్టింగ్ జగపతి బాబు , రావు రమేష్ , అను ఇమ్మాన్యుయేల్ , అదితిరావు హైదరి , డిఫెరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మేకింగ్ వీడియోస్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు సినిమా మీద మొదటి నుంచి పోజిటివ్ బజ్ ఏర్పడేలాచేసింది చిత్ర యూనిట్ .. ఇంకా ఈ సినిమా లో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ లు పోటీ పడి మరి నటించారు .. రావు రమేష్ , మరియు జగపతి బాబు డైలాగ్స్ బాగున్నాయి ..గూని బాబ్జీగా రావు రమేశ్‌ క్యారెక్టర్ కు న్యాయం చేశారు . ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం. , మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు .. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు తమకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు .. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అదిరిపోయింది బాగుంది. ఇక ఈ సినిమా లో విలన్ విషయానికి వస్తే విలన్‌ గా ధనుంజయ్‌గా రామచంద్ర రాజు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు .. ఈ సినిమా ను నిర్మాత అనిల్ సుంకర ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .. మహా సముద్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా యాక్షన్, భావోద్వేగాలు మధ్య నడిచే స్టోరీ అని క్లారిటీ గా చేప్పారు , తాను పేపర్ మీద రాసుకున్న స్టోరీ ని ఎక్కడ కాంప్రమైజ్ క్కకుండా తెరకెక్కించారు ..

తీర్పు : ఓవర్‌సీస్‌లో ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ముందుగా పడటంతో ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు స్పందిస్తున్నారు. సినిమా ఎలా ఉందనే విషయాన్ని చెబుతూ ట్వీట్స్ పెడుతున్నారు. ‘మహా’ పాత్రలో నటించిన అదితిరావు హైద‌రి మూవీలో స్పెషల్ అట్రాక్షన్ కానుందని, ఇద్దరు హీరోలు సిద్దార్థ్, శర్వా పోటీపడి నటించారని యూనిట్ సభ్యులు చెప్పారు. అజయ్ భూపతి టేకింగ్, లొకేషన్స్ పరంగా రిచ్‌గా ఉందని, చేతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌కి ప్రాణం పోసిందని అన్నారు.

Leave a Reply