“లవ్ స్టోరి” సక్సెస్
“లవ్ స్టోరి” సక్సెస్ మాటలకు అందని సంతోషాన్నిచ్చింది – సినిమా టీమ్ మెంబర్స్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ పాత్రికేయులతో పంచుకుంది. ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ విజయోత్సవ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా లవ్ స్టోరి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…ఎన్నో కష్టాలు పడి లవ్ స్టోరి సినిమా మీ ముందుకు తీసుకొచ్చాం. ఇవాళ ప్రేక్షకులు మా సినిమాకు గొప్ప విజయాన్ని అందించారు. లవ్ స్టోరి సినిమా తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ విజయం గురించి వింటుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య తెరకెక్కించిన ఈ కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. ఈ కార్యక్రమంలో ఇంటిలో, బయటా ఇబ్బందులకు గురయ్యే అమ్మాయిలను నిర్భయంగా మాట్లాడమని చెప్పాం. అక్కడి నుంచి ఈ సినిమా కథకు ఇన్సిపిరేషన్ దొరికింది. లవ్ స్టోరి కథను తెరకెక్కించడం కత్తి మీద సాము. అలాంటి కథను బాగా చూపించామని చెబుతుండటం సంతోషంగా ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను ఒక ఆడపిల్ల బయటకు చెప్పుకోగలిగే ధైర్యం ఈ సినిమా చూసి తెచ్చుకుంటే, వివక్షకు గురైన ఒక ఊరి అబ్బాయి ఇది నా కథ అని రిలేట్ చేసుకుంటే మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తాను. నా సినిమాల మీద ఉన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్. నాగ చైతన్య, సాయి పల్లవి తమ క్యారెక్టర్స్ లో లీనమై సహజంగా నటించారు. మా యూనిట్ లోని ప్రతి ఒక్కరికి లవ్ స్టోరి సక్సెస్ పట్ల థాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్నారు.
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ…ఇప్పుడున్న టైమ్ లో థియేటర్లకు ఆడియెన్స్ ఎంతవరకు వస్తారు అని రిలీజ్ ముందు భయపడ్డాం కానీ ఇవాళ థియేటర్స్ లో ప్రేక్షకులను చూస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది. లవ్ స్టోరి చిత్రంలో దర్శకుడు శేఖర్ కమ్ముల అడ్రస్ చేసిన ఇష్యూస్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆ అంశాన్నింటినీ సినిమా చూసిన వాళ్లు ప్రశంసిస్తున్నారు. లవ్ స్టోరి సినిమా థియేటర్ లలో చూడాల్సిన సినిమా. తప్పకుండా థియేటర్లకు రండి మీరు మూవీని ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరి చిత్రానికి పనిచేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. అన్నారు.
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ….మా సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. స్టార్స్ ట్వీట్స్ చేశారు. ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్స్ మా సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. లవ్ స్టోరి వినోదం కోసం చూసే సినిమా మాత్రమే కాదు…ఇందులో మన చుట్టూ సమాజంలో, మన ఇంట్లో జరిగే అవకాశమున్న సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లకు ఇంట్లో, బయటా ఇబ్బందిగా ఉంటే మీరు తప్పకుండా అడగాలి. అలాంటి మార్పు లవ్ స్టోరి చూశాక వస్తే మేము సంతోషిస్తాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్ ను టచ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని అభినందించాలి. అన్నారు.
నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ…లవ్ స్టోరి సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. సినిమా బాగుందంటూ ప్రతి థియేటర్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో భారీగా రిలీజైన సినిమా మాదే. ఇంత గ్రాండ్ రిలీజ్ కు మాకు సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్య, సాయి పల్లవి..ఇలా ఈ టీమ్ తో మాకు మంచి బాండింగ్ ఉంది. అందుకే మా అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది. అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ…లవ్ స్టోరి సక్సెస్ గురించి ఇవాళ ప్రేక్షకులే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇదే కాంబినేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల గారు నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.