పీబీసీ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ని ముంబైలోని జేడబ్ల్యు మారియట్ హోటల్‌లో ప్రారంభం.

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 23, 2023: విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు నమ్మకమైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యమని‌ సినీబస్టర్ మ్యాగజైన్ యజమాని రోనీ రోడ్రిగ్స్‌ తెలిపారు. ‌పీబీసీ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ని ముంబైలోని జేడబ్ల్యు మారియట్ హోటల్‌లో బుధవారం ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి నిర్మాత ధీరజ్ కుమార్, నటుడు దర్శన్ కుమార్, నటి నైరా బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోనీ రోడ్రిగ్స్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అనిశ్చితులను గుర్తిస్తూ.. నిష్పాక్షికమైన నిజాయితీగల సలహాల అవసరం ఉందన్నారు. సంస్థ నినాదం నిజాయితీ, సమగ్రతతో కలిసి పోయాయన్నారు. ఇది పనిలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా విద్యార్థులకు ఊహించని ఆర్థికపరమైన ఒత్తుడులు ఎదురవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడిన సంఘటనను చూశానన్నారు. ఈ అనుభవమే పీబీసీ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ స్థాపనకు దారి తీసిందన్నారు.

ఈ అధ్యయనం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ స్పష్టమైన ధర నిర్మాణాన్ని కలిగి ఉందన్నారు. ఎటువంటి హిడెన్ చార్జీలు లేవన్నారు. పీబీసీ‌ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనువైన నిబంధనలతో లోన్‌లను సులభతరం చేయడం ద్వారా అర్హులైన విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ధీరజ్ కుమార్, దర్శన్ కుమార్, నైరా బెనర్జీ తదితరులు ఈ చొరవను ఆమోదించారన్నారు. విదేశీ విద్యను అభ్యసించడంలో ఉన్న అడ్డంకులను, ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కంపెనీ ప్రయత్నాలను మెచ్చుకున్నారని తెలిపారు.

ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించడానికి ఇండోర్‌లోని ప్రెస్టీజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్‌లో పీజీ క్యాంపస్ డీన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ లా డైరెక్టర్ రవి రాజాతో సహా నిపుణులను కంపెనీ చేర్చుకుందన్నారు.

యూఎస్, సింగపూర్‌లో సహకారాలతో పీబీసీ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూకే, కెనడా, యూరప్‌లకు విస్తరించే ప్రణాళికలతో అంతర్జాతీయ విజయాన్ని లక్ష్యంగా చేసుకుందన్నారు.

యూఎస్ లో డాక్టర్ కిరణ్ కదమ్, ఐఐటీ బాంబే పూర్వవిద్యార్థి కంపెనీకి నాయకత్వం‌ వహిస్తున్నారన్నారు. విద్యారంగంలో అనుభవం ఉన్న ఇంజనీర్ ధర్మరాజ్ తంగరాజ్ సింగపూర్‌లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో నిషా వర్మ, కీర్తికుమార్ కదమ్ కార్యకలాపాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు.

విద్యా రుణాలపై విద్యార్ధులు, తల్లిదండ్రులకు నజ్నీన్ బరాయ్ మార్గనిర్దేశం చేస్తారన్నారు. సుజానా అల్ఫోన్సో మార్కెటింగ్‌ను నిర్వహిస్తుందన్నారు. వీసా, టిక్కెట్ సంబంధిత విషయాల కోసం దీపేష్ సోమయ్య ప్రయాణ భాగస్వామిగా ఉన్నారని తెలిపారు.

పీబీసీ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రోనీ రోడ్రిగ్స్ విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు పారదర్శకమైన భవిష్యత్తును కల్పించి, వారి ఆకాంక్షలపై సానుకూల ప్రభావం చూపుతున్నారన్నారు.

విశిష్ట సెలబ్రిటీ అతిథులందరికీ కంపెనీ లోగో చెక్కిన 50 గ్రాముల వెండి నాణెంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినోద పరిశ్రమకు చెందిన దిలీప్ సేన్, బెర్రీ, ఆర్తీ నాగ్‌పాల్ తదితరులు పాల్గొన్నారు. వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

Leave a Reply