లేడి ఓరియెంటెడ్ సినిమాకు సై అంటున్న ఉప్పెన బ్యూటీ …

లేడి ఓరియెంటెడ్ సినిమా మీద ఇంట్రస్ట్ చూపిస్తున్న ఉప్పెన బ్యూటీ … “

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘ఉప్పెన” .. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ , హీరోగా లాంచ్ చేస్తూ , అలానే సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో ఒకరు అయిన డైరెక్టర్ బుచ్చి బాబు ఉప్పెన సినిమా తోనే ఇద్దరు టాలీవుడ్ కి పరిచయము అయ్యారు .. పంజా వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించేందుకు మొదటగా చాలా పేర్లు వినిపించాయి , భారీ ఎత్తున ఆడిషన్స్ కూడా జరిగాయి , ఫైనల్ గా డైరెక్టర్ సుకుమార్ , మరియు బుచ్చిబాబు , హీరోయిన్ గా కృతి శెట్టి ని ఒకే చేశారు , అలా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి పరిచయము అయింది .. మొదటి సినిమాతో నే తన అందం , అభినయం , నటనతో యూత్ ని ఆకట్టుకుంది . మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో n0 1 హీరోయిన్ గా ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది .. ఉప్పెన సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ కు భారీ ఆఫర్స్ వచ్చాయి .. ప్రస్తుతం హీరోయిన్ కృతి శెట్టి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది .. ఉప్పెన సినిమా తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ , మరియు నేచురల్ స్టార్ నాని తో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తో పాటు హీరో సుధీర్ బాబు సినిమాలోనూ మరియు , ‘బంగార్రాజు’ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతము కృతి శెట్టి చేతిలో వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి , అయితే తాజాగా , కృతి శెట్టి యూ టర్న్ తీసుకొని ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి … మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ మధ్యనే నిర్మాతగా మారి జి స్టూడియోస్ వారితో కలిసి పలు వెబ్ సిరీస్ లు, సినిమాలను నిర్మిస్తున్నారు ..ఈ నేపథ్యంలోనే సుష్మిత వద్దకు ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ రాగా.. ఆ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లో కృతి శెట్టి అయితే బాగుంటుందని భావిస్తున్నారు ..ప్రస్తుతం సుష్మితా ఈ ప్రాజెక్టు విషయమై చర్చలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తుంది . అంతే కాదు దాదాపు ఈ లేడి ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి ఫైనల్ అయినట్లు సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ గా మారింది .. మొత్తానికి కృతి శెట్టి లేడి ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ వచ్చింది అనే విషయం లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే దీని పై అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వస్తే గాని క్లారిటీ రాదు ..