“సైక్లోథాన్” నిర్వహించిన కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్

తెలుగు సూపర్ న్యూస్,డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 7,2023: నేటి మారుతున్న జీవనశైలికీ వ్యాయామం, మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. వ్యాయమంలో వాకింగ్, జాగింగ్ తరువాత సైకిలింగ్ ప్రాధాన్యత కలిగి వున్నది. ఈ విశిష్టతను గుర్తించి, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, కీసర వారు శనివారం అక్టోబరు- 7న “సైక్లోథాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనిలో భాగంగా ఆసక్తి గల విద్యార్థులు, యువతీ యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు 5k అండ్ 10k సైకిలింగ్ పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు బహుమతిని అంద చేసారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ సైక్లోథాన్ లో అవకాశం కల్పించారు. సుమారు 500 మందికి పైగా చిన్నారులు, యువతీ యువకులు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనడం జరిగింది.

5 :30 నిమిషాలకు ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి కల్నల్ సంజయ్, అంకుర ఆసుపత్రి నుంచి డా. నవ్య, Mr.తెలంగాణ, జాతీయ బాడీ బిల్డర్ వాహిద్, డైరెక్టర్ సుశీల్ కుమార్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వ్యక్తిత్వ వికాసానికి మానసిక ఆరోగ్యం ముఖ్యమని, శారీరక ఆరోగ్యంతో దీనిని పొందవచ్చని వారు పేర్కొన్నారు. సైక్లోథాన్ తరువాత వార్మప్ ఎక్సర్సైజ్లు, జుంబాడాన్స్, యోగా నిర్వహించారు. యోగా చేయటం వలన శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని వారు పేర్కొన్నారు.

ఇంకా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి గ్రెసిల్డా రోజ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ పోటీ నిర్వహణలో పాల్గొన్నారు.

ఈ పోటీలో సైక్లోథాన్లో పాల్గొన్న వారికి అల్పాహారాన్ని, మంచినీటిని నిర్వాహకులు అందజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆనందంతో పాటు ఆరోగ్యం పట్ల అవగాహనను కలుగ జేసిందని పలువురు పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన పల్లవి స్కూల్ యాజమాన్యాన్ని వారు అభినందించారు. పాఠశాల లోని పచ్చని, చల్లని వాతావరణం మధ్య ఈ కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది.

Leave a Reply