బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెలెబ్రేషన్స్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్ ఆగష్టు14,2023: బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఇన్వెస్టిచర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కల్నల్ రంజిత్ చాకో హాజరయ్యారు.

పాఠశాల ఎలక్షన్స్ లో స్పోర్ట్స్ క్యాప్టెన్ (బాయ్), స్పోర్ట్స్ క్యాప్టెన్ (గర్ల్),హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ గా కొత్తవాళ్లు ఎన్నుకున్నారు.

ఎన్నుకున్న వాళ్లకు బ్యాడ్జెస్, శాషెస్ ప్రదానం చేశారు. స్కూల్ క్యాబినెట్ నాలుగు హౌజులకు చెందిన కృష్ణ, గంగ, గోదావరి, కావేరి విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థుల చేత తమ బాధ్యతలు సక్కమంగా నిర్వర్తిస్తామని ప్రమాణం చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా కల్నల్ రంజిత్ చాకో మాట్లాడుతూ.. “నాయకులకు బాధ్యతల నిర్వహణ, నిజాయతీ, సమదృష్టి భావన వంటివి ఉండాలని చెప్పారు. ఆయా లక్షణాల గురించి యువ నాయకులకు చెప్పివాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.

స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ.. “చిన్నతనం నుంచే నాయకత్వపు లక్షణాలు అలవర్చుకుని సమాజానికి తమ వంతు కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన లీడర్స్ కు సూచించారు.

ప్రిన్సిపాల్ శ్రీమతి అనురాధ మాట్లాడుతూ.. నేటి విద్యార్థి నాయకులే రాబోయే కాలంలో దేశాన్ని ప్రగతిపథంలో నడిపే ధృవతారలు అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ఘనంగా నిర్వహించిన వారందర్నీ ఆమె అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా బాధ్యతగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.

Leave a Reply