భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ రంగిత తన మొదటి స్టోర్‌ను విశాఖపట్నంలోని గాజువాకలో ప్రారంభం..

తెలుగు సూపర్ న్యూస్,డిసెంబరు 22, 2023: స్టెల్లారో బ్రాండ్స్‌కు చెందిన ప్రముఖ డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ రంగిత, విశాఖపట్నంలోని సీఎంఆర్ సెంట్రల్ గాజువాకలో తన మొదటి ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్‌ను ఘనంగా ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల ప్రజల ఫ్యాషన్ అవసరాలను తీర్చడం ద్వారా, ప్రియమైన ఆన్‌లైన్ బ్రాండ్ నుంచి భౌతిక రిటైల్ ఉనికితో రంగిత ఒక మైలురాయిని నెలకొల్పింది. ప్రారంభోత్సవానికి ప్రముఖ భారతీయ నటి మేఘనా లోకేష్ హాజరయ్యారు.

విశాఖపట్నంలో ప్రముఖ ప్రాంతంలో ఉన్న మాల్‌లో 950 చ.అడుగుల విస్తీర్ణంలోని కొత్త స్టోర్, ప్రత్యేకమైన, లీనమయ్యే షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సంప్రదాయ సౌందర్యం, సమకాలీన డిజైన్‌ల ప్రత్యేకమైన సమ్మేళనానికి ప్రసిద్ధి చెందిన రంగిత కలెక్షన్, అనేక రకాల ఎథినిక్ దుస్తులను అందిస్తుంది. సొగసైన కుర్తాల నుంచి సున్నితమైన చీరల వరకు, విభిన్న అభిరుచులు కలిగిన కస్టమర్ బేస్‌కు కావలసిన వాటిని స్టోర్ అందిస్తుంది. ప్రతి షాపర్ తమ వ్యక్తిగత స్టైల్‌ను ప్రతిబింబించే వాటిని పొందవచ్చని ఇది నిర్ధారిస్తుంది. కొత్త స్టోర్ సౌకర్యవంతమైన ఫిట్టింగ్ జోన్‌లు, దుస్తులు మార్చుకునేందుకు విశాలమైన గదులు, చక్కని షాపింగ్ వాతావరణాన్ని కలిగి ఉంది.

హై-క్వాలిటీ ఇండియన్ వేర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి, ఫ్యాషన్‌గా మార్చడంలో రంగిత ఎప్పుడూ ముందుంటుంది. రూ.399 నుంచి రూ.1499 వరకు ధరల శ్రేణిలో, సరసమైన ధరలకు ఫ్యాషన్-ఫార్వర్డ్ దుస్తులను అందించేందుకు రంగిత కట్టుబడి ఉంది.

రంగిత విభిన్న ఉత్పత్తుల శ్రేణి మహిళల విభిన్న అవసరాలను తీర్చేలా క్యూరేట్ చేయగా, ఇది రోజువారీ దుస్తులు మరియు పండుగ కలెక్షన్లను కలిగి ఉంది. ఈ ఆలోచనాత్మక ఎంపిక ‘తుమ్ హి హో రంగితా’ అనే ఇటీవలి క్యాంపెయిన్‌లో ప్రతిధ్వనించినట్లుగా, మహిళల వ్యక్తిత్వాన్ని చాటి చెప్పేందుకు బ్రాండ్ నిబద్ధతకు నిజమైన ప్రతిబింబంగా ఉంది. ఈ హృదయపూర్వక ప్రయత్నం మహిళల ఆనందం, ప్రత్యేకత, వారి జీవిత ప్రయాణాన్ని నిర్వచించే మద్దతు మరియు స్నేహాల శాశ్వతమైన బంధాలకు సంతోషకరమైన వేడుకగా ఉంటుంది.

కొత్త స్టోర్ ప్రారంభం గురించి స్టెల్లారో బ్రాండ్స్ సీఈఓ హిమాన్షు చక్రవర్తి మాట్లాడుతూ, ‘‘విశాఖపట్నంలో మా మొదటి భౌతిక స్టోర్‌ను ప్రారంభించడం భారతీయ మార్కెట్ ఫ్యాషన్ అవసరాలను సమగ్రంగా తీర్చాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఒక అడుగు ముందుకు వేశాము. మా విధానం ఎల్లప్పుడూ కస్టమర్-సెంట్రిక్, ఈ విస్తరణ మల్టీ ఛానెళ్లలో అందుబాటులో ఉండాలనే మా నిబద్ధతకు నిదర్శనం’’ అని పేర్కొన్నారు. ‘‘విశాఖపట్నంలోని మా కొత్త స్టోర్ కేవలం షాపింగ్ గమ్యస్థానం మాత్రమే కాదు; ఇది రంగిత శక్తివంతమైన ప్రపంచానికి ప్రవేశ ద్వారం. ఇక్కడ సంప్రదాయం ఆధునికతతో అనుసంధానం అవుతుంది. ప్రతి వినియోగదారుడు తమ పరిపూర్ణ స్టైల్ వ్యక్తీకరణను కనుగొనవచ్చు’’ అని వివరించారు.

రంగిత విస్తృతమైన ఆన్‌లైన్ ఉనికిని కలిగి ఉంది. అమెజాన్, అజియో, ఫ్లిప్‌కార్ట్, మింత్ర మరియు టాటా క్లిక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. భౌతిక రిటైల్‌లోకి వెళ్లడం దాని వృద్ధి కథనంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. దక్షిణాది మార్కెట్‌పై వ్యూహాత్మక దృష్టితో ప్రారంభించి, భారతదేశం వ్యాప్తంగా విస్తృత విస్తరణకు వెళ్లాలని బ్రాండ్ భావిస్తుంది.

రంగిత అభివృద్ధి చెందుతూ మరియు విస్తరిస్తూనే ఉంది. విశాఖపట్నంలోని తర మొదటి స్టోర్ ఫ్యాషన్ ప్రియులకు మైలురాయిగా మారనుంది. భారతీయ ఫ్యాషన్ పరిశ్రమలో బ్రాండ్ పెరుగుతున్న వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.

Leave a Reply