గచ్చిబౌలి లో “పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్” ప్రారంభం

హైదరాబాద్ ,సెప్టెంబర్19, 2023: గచ్చిబౌలి లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో నాణ్యమైన చికిత్స అందించే కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. “పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్” పేరుతో ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. “అమెరికాలో అందించే క్యాన్సర్ వైద్యం హైదరాబాద్ లో అందుబాటులో అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది”..అన్నారు.

“క్యాన్సర్ పైపరిశోధన చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రైవేటు హాస్పిటల్స్ వారు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలి.. మారుతున్న టెక్నాలజీ నీ అందిపుచ్చుకుని వైద్యం అందించాలి.”అని మంత్రి కోరారు. గచ్చిబౌలి లోని పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ హెడ్ గా వినాయక రెడ్డి వ్యవహరించనున్నారు.

Leave a Reply