హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ లో సత్తా చాటిన హైదరాబాదీ బాడీ బిల్డర్స్..

Hyderabadi bodybuilder

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్ ,జనవరి 31,2023:కర్ణాటకలోని సేడమ్ లో మొట్టమొదటి సారిగా హెల్త్ అండ్ ఫిట్నెస్ షఫీ షమీ బాడీబిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్ ఛాంపియన్‌షిప్-2023 ప్రోగ్రామ్ జరిగింది. ఇందులో మన హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు తమ టాలెంట్ చూపించి విజేతలుగా నిలిచారు.

దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల నుంచి ఈ పోటీలో బాడీ బిల్డర్లు పాల్గొనగా, మన హైదరాబాద్ నుంచి పాల్గొన్న హరీష్ కుమార్, మన్సూర్ షా ఇద్దరు కూడా ఓవరాల్ విన్నర్స్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ బీబీ ప్రో అఫ్రోజ్ ఖాన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా ఆర్గనైజర్ షఫీ షమీ మాట్లాడుతూ .. అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కంటే బాడీబిల్డింగ్ కోసం చాలా కష్టపడాలని అన్నారు. బాడీ బిల్డింగ్ కాంపిటేషన్ లోపాల్గొన్న ప్రతిఒక్కక్కరు విన్నరే అని ఆయన చెప్పారు.

Leave a Reply