అఖిల‌భార‌త కె-పాప్ పోటీ 2023’ ప్రాంతీయ రౌండుకు వేదికకానున్న హైద‌రాబాద్

తెలుగు సూపర్ న్యూస్,హైద‌రాబాద్, జూన్ 19, 2023: కొరియా, భారతదేశాల‌ మధ్య దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీఐ), ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సహకారంతో ‘ఆల్ ఇండియా కె-పాప్‌ కాంటెస్ట్ 2023’ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ లో జరిగిన ప్రాంతీయ రౌండులో 27 బృందాలు (15 నృత్యం, 12 గాత్రం) ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. సభాస్థలికి వచ్చిన కె-అభిమానులు వారిని ఉత్సాహపరిచారు.

ఆన్‌లైన్‌, రీజినల్, సెమీ ఫినాలే, గ్రాండ్ ఫినాలే.. అనే నాలుగు రౌండ్లతో సుమారు ఆరు నెలల పాటు దేశవ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతాయి. ఆన్‌లైన్‌ క్వాలిఫయర్స్ రౌండు ఏప్రిల్ 26 నుంచి మే 13 వరకు జరిగింది. ఇందులో దేశ‌వ్యాప్తంగా 11,071 జట్లు పాల్గొన్నాయి. ఇది భారతదేశంలో పోటీ ప్రారంభమైనప్పటి నుంచి (2011) అతిపెద్ద భాగస్వామ్యం. ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ నుంచి ఎంపికైన వారు 11 నగరాల్లో జరిగే రీజినల్ రౌండులో పాల్గొంటారు.

ఈ సంద‌ర్భంగా కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా డైరెక్టర్ హ్వాంగ్ ఇల్-యాంగ్ మాట్లాడుతూ, “కె-పాప్ అంటే కేవలం కొరియన్ పాప్ పాటలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కనెక్ట్ చేయడానికి ఒక మాధ్యమంగా మారింది. భారతదేశంలో కూడా కె-పాప్ ను ఇష్టపడే, దానిలో ప్రతిభావంతులైన యువకులు చాలామంది ఉన్నారు.

కొరియా-భారత్ దౌత్య సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్త‌యిన సంద‌ర్భంగా… కొరియా, కె-పాప్‌ను ఇష్టపడే భారతీయ యువకులు వేదికపై నిలబడి, ప్రదర్శనను ఆస్వాదించడానికి, వారి కలలను కొనసాగించడానికి ఒక వేదికను సృష్టించాలని మేము కోరుకున్నాము. పాల్గొనేవారు, ప్రేక్షకులు అందరూ కె-పాప్, మా వేదికల ద్వారా తమను తాము అర్థం చేసుకోగలరని, ప్రేమించగలరని, త‌మ‌ను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించగలరని నేను ఆశిస్తున్నాను” అన్నారు.

ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ జియోన్ హాంగ్-జు మాట్లాడుతూ, “కె-పాప్ ఎట్టకేలకు భారతదేశంలో ప్రవేశించిందని చెప్పాల్సిన సమయం వ‌చ్చింది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియాతో కలిసి కె-పాప్ పోటీని నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది.

యువతకు వారి అభిరుచిని వ్య‌క్తం చేయ‌డానికి సరైన వేదికను ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. కె-పాప్ ప్రపంచవ్యాప్త‌ సంచలనంగా మారింది. భారతీయ యువకులు కె-పాప్ త‌మ తరంతో ప్రతిధ్వనిస్తుందని భావిస్తారు. 10,000 కంటే ఎక్కువ బృందాలు తమ సమర్పణలను పంపడం, చాలా మంది ఆసక్తి చూపడం మాకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.

Leave a Reply