ఓటీటీ ప్లాట్ ఫామ్ లోభారీ రేట్స్ పలికిన ఆచార్య సినిమా

ఆచార్య సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ..

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్యా అనే సినిమాలో నటిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకొని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని స్పీడ్ గా జరుపుకుంటోంది. . ఆచార్య సినిమా తరువాత డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ సినిమా , మరియు మెహెర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ , బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి .. తాజగా మెగా స్టార్ చిరంజీవి మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కు ఛాన్స్ ఇచ్చిన్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా గురించి ఓకే ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి.. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ సాంగ్ రిలీజ్ చేయగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ సినిమా , వరల్డ్ వైడ్‌గా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది .

ఆచార్య సినిమాకు సంబంధించి రోజు ఏదోఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది , ప్రస్తుతం ఆచార్య సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో ఓ న్యూస్ వైరల్ అయింది .. ఈ సినిమా పోస్ట్ థ్రియాట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ సినిమాల అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తుంది అని తెలుస్తుంది . ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది ఆచార్య. ఆచార్య సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఎంత రేటుకు పలికిందో , మరి ఆ ఫ్యాన్సీ ఆఫర్ డీల్ కు మెగా స్టార్ చిరంజీవి డీల్ కుదిరిందో అనే విషయం తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..