బాదములతో డైట్‌ను మెరుగుపరుచుకోవడం ద్వారా ఆరోగ్యం మీ సొంతం..

almonds

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్ ,ఏప్రిల్ 7,2023:ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 7వ తేదీన అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం జరుపుతుంటారు. ఈ సంవత్సరం ఈ దినోత్సవ నేపథ్యంగా అందరికీ ఆరోగ్యంను తీసుకున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యం మెరుగుపరిచేందుకు దృష్టి సారించింది.

ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని మనం లక్ష్యంగా చేసుకున్న వేళ, ఆరగ్యవంతమైన ఆహారం ప్రాధాన్యతను గుర్తించాల్సి ఉంది. ఇది దీర్ఘకాలిక, అంటువ్యాధులను నివారించడం, నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. బాదములను ఆరోగ్యవంతమైన ఆహారంగా గుర్తించారు. బాదములలో అత్యధిక ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌, విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఆరోగ్యానికి అత్యంత కీలకం. దీనితో పాటుగా బాదములలో జింక్‌, రాగి, ఫోలేట్‌, ఐరన్‌ ఉన్నాయి.

పలు అధ్యయనాలు వెల్లడించిన దాని ప్రకారం, బాదముల కారణంగా గుండె ఆరోగ్యం మెరుగుపరడటంతో పాటుగా కొలెస్ట్రాల్‌ స్ధాయి తగ్గడం, బ్లడ్‌ షుగర్‌ స్ధాయి నిర్వహించబడటం, బరువు నియంత్రణలో ఉండటం జరుగుతుంది. ఈ ప్రయోజనాలే బాదములను ఆరోగ్యవంతమైన జీవనశైలి కోరుకునే వారికి అత్యద్భుతమైన ఎంపికగా నిలిపాయి.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ , ఢిల్లీలో రీజనల్‌ హెడ్‌– డైటెటిక్స్‌గా సేవలనందిస్తున్న డాక్టర్‌ రితికా సమద్ధార్‌ మాట్లాడుతూ ‘‘నాన్‌ కమ్యూనికబల్‌ రోగాల భారం తగ్గిచుకోవడానికి నివారణ అత్యంత కీలకం. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవాట్లు చేసుకోవడం అవసరం. ఈ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ వేళ , మన ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చుకోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ప్రాధాన్యతలను చేసుకోవడం చేయాలి. పోషకాలతో కూడిన ఆహారం బాదములు. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నిజానికి యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లీనికల్‌ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజుకు 43 గ్రాముల బాదములను పొడిగా రోస్ట్‌ చేసుకుని తింటే అది ఆకలిని తీర్చడంతో పాటుగా డైటరీ విటమిన్‌ ఈ,మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్‌ను సైతం శరీర బరువు పెంచకుండా పెంచుతాయి’’ అని అన్నారు.

న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మనం రోజూ తినే ఆహారం పట్ల ఆప్రమప్తంగా ఉండాలి. మన రోజువారీ ఆహారంలో బాదములు జోడించుకోవడం ఓ చక్కటి ఎంపిక. కొన్ని రకాల పోషకాలు వీటిలో ఉన్నాయి. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములతో కార్డియో వాస్క్యులర్‌ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఈ అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ వేళ తమ ఆరోగ్యంలో మరిన్ని బాదములు భాగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను’’ అని అన్నారు..

బాలీవుడ్‌ సెలబ్రిటీ,నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ ‘‘ ఇంటి వద్ద ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నామనే భరోసా పొందడానికి నేనెప్పుడూ కూడా ఆరోగ్య వంతమైన స్నాక్స్‌ తీసుకోవాల్సిందిగా సూచిస్తుంటాను. బాదములను రోజూ తింటే రోగ నిరోధకశక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిలో జింక్‌, రాగి, ఐరన్‌ , ఫోలేట్‌ వంటివి ఉన్నాయి’’ అని అన్నారు.

సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘ ఆరోగ్యమంటే శారీరక ధృడత్వం ఒక్కటేకాదు మానసిక, భావోద్వేగాల పరంగా కూడా ఆరోగ్యవంతంగా ఉండటం. మనం చక్కటి ఆరోగ్యం దిశగా ప్రయత్నిస్తోన్న వేళ మన జీవితాలపై పౌష్టికాహార పాత్రను మరువరాదు. బాదములలో విస్తృత శ్రేణి ప్రొటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యవంతమైన కొవ్వు ఉన్నాయి. వర్కవుట్‌ తరువాత ఆహారంగా కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి’’ అని అన్నారు.

చెఫ్‌ శర్నష్‌ గోయిలా మాట్లాడుతూ ‘‘ ఓ చెఫ్‌గా నేను నా వంటకాలలో బాదములను వాడుతుంటాను. అవి రుచికరమైన క్రంచ్‌ను అందించడంతో పాటుగా రోజువారీ సలాడ్స్‌, బేక్డ్‌ గూడ్స్‌ వంటి వాటికి సైతం గింజల ఫ్లేవర్‌ను అందిస్తుంది’’ అని అన్నారు.

ఇంటిగ్రేటివ్‌ న్యూట్రిషనిస్ట్‌ మరియు హెల్త్‌ కోచ్‌, నేహా రంగ్లానీ మాట్లాడుతూ ‘‘ఓ న్యూట్రీషియనిస్ట్‌ గా నేనెప్పుడూ కూడా తమ రోజువారీ డైట్‌లో బాదములను జోడించుకోమని చెబుతూనే ఉంటాను. వీటితో గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటుగా బరువు నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. అమెరికన్‌ హార్ట్‌అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ప్రతి రోజూ 42గ్రాముల బాదములు తింటే ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ మెరుగుపడటంతో పాటుగా నడుం దగ్గర కొవ్వు కూడా కరుగుతుంది’’అని అన్నారు.

భారతీయ టెలివిజన్‌,సినీ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యం అనేది గమ్యం కాదు అది ఓ ప్రయాణం. మనం ఏమి తింటున్నామనేది ఆ ప్రయాణంలో అత్యంత కీలకం. బాదములలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మనం శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండటంలో సహాయపడతాయి. అందువల్ల, బాదములతో ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితానికి ఓ అడుగు ముందుకేయండి’’ అని అన్నారు.

ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడం గురించి దక్షిణాది నటి ప్రణీత సుభాష్‌ మాట్లాడుతూ ‘‘ఆరోగ్యం అందరికీ తొలి ప్రాధాన్యతగా ఉండాలి. మన జీవితంలో సాధించే విజయాలన్నింటికీ ఇది పునాది. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, బాదములతో పోషకాలను పొందడానికి ప్రయత్నిద్దాము’’ అని అన్నారు.

Leave a Reply