ఫిబ్రవరి 17న విజయవాడలో 500 టెక్ ప్రొఫెషనల్స్ కోసం హెచ్ సీఎల్ టెక్ నియామకం డ్రైవ్..

తెలుగు సూపర్ న్యూస్,విజయవాడ, ఫిబ్రవరి 16, 2024:టెక్నాలజీస్ లో 500కి పైగా స్థానాల కోసం ప్రజలను నియామకం చేయడానికి గన్నవరం, విజయవాడల్లో తమ క్యాంపస్ లలో ఫిబ్రవరి 17న HCLTech, ఒక ప్రము అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ నియామకం డ్రైవ్ నిర్వహిస్తుంది.
టెక్నాలజీస్ లో మూడు లేదా ఎక్కువ సంవత్సరాల పని అనుభవంతో ఉన్న ప్రొఫెషనల్స్ కోసం హెచ్ సీఎల్ టెక్ నియామకం డ్రైవ్ అవకాశాలు అందచేస్తోంది.

(జావా ఫుల్ స్టాక్ డవలపర్స్, జావా+ ఏడబ్ల్యూఎస్
డవలపర్స్, మైక్రోసాఫ్ట్ – నెట్ డవలపర్స్, ఒరాకిల్/ PLSQL డవలపర్స్, SAP: ABAP, హనా, బేసిస్,
సీ/లినక్స్ డవలపర్స్, SQL/Oracle DBA). “HCLTech విజయవాడ క్యాంపస్ ఫిబ్రవరి 14, 2020న స్థాపించబడింది. కేవలం స్వల్ప సమయంలో, ఇది ఆంధ్రప్రదేశ్ లో తన స్థానాన్ని అతి పెద్ద ఐటీ సర్వీసెస్ ఉద్యోగులలో ఒకటిగా నిలుపుకుంది.


మా విభిన్నమైన సిబ్బంది ఇక్కడ ఇప్పుడు సరికొత్త, అత్యంత ముఖ్యమైన సాంకేతిక పురోగతిలలో నిపుణుల నైపుణ్యాలతో 100కి పైగా అంతర్జాతీయ క్లైంట్స్ కు సేవలు అందిస్తున్నారు. మెగా నియామకం డ్రైవ్ ద్వారా, టీమ్ కు అద్భుతమైన మనస్సులను స్వాగతించడానికి ఉత్సాహపడుతున్నాం,” అని శివ ప్రసాద్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, విజయవాడ సెంటర్, HCLTech ప్రధాన అధికారి అన్నారు.

30 ఎకరాల్లో విస్తరించిన, HCLTech వారి విజయవాడ క్యాంపస్ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినమ్ ధృవీకరణను కలిగి ఉంది. సుస్థిరతకు,పర్యావరణహితానికి తన నిబద్ధతను ప్రతిఫలిస్తోంది.

HCLTech వారి విజయవాడ క్యాంపస్ లో 43% మహిళా సిబ్బంది ఉన్నారు.
HCLTech కు 60 దేశాల్లో అంతర్జాతీయ ఉనికి ఉంది.ఈ దేశాల్లోని 26 దేశాల్లో టాప్ ఎంప్లాయర్
రేట్ ని కలిగి ఉంది. దీని సమగ్రమైన పోర్ట్ ఫోలియో పూర్తి డిజిటల్ పరివర్తనను నేవిగేట్ చేయడంలో క్లైంట్స్ కు సహాయపడటానికి డిజిటల్, ఇంజనీరింగ్, క్లౌడ్, ఏఐ,సాఫ్ట్ వేర్స్ లో విస్తరించింది.

Leave a Reply