పుణేలోని రంజంగాన్ తయారీ యూనిట్ కు ఐఎస్ఐ సర్టిఫికేషన్ సాధించిన ప్రపంచ నెంబర్ వన్ డీప్ ఫ్రీజర్ బ్రాండ్ హయర్

తెలుగు సూపర్ న్యూస్,న్యూఢిల్లీ, జూన్ 22, 2023: భారతీయ ఉపకరణాల పరిశ్రమలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకుని వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులను అందిస్తోంది హయర్ అప్లయన్సెస్ ఇండియా. హోమ్ అప్లయన్సెస్ లో గ్లోబల్ లీడర్ గా ,14 ఏళ్ల పాటు మేజర్ అప్లయెన్సెస్‌లో ప్రపంచ నంబర్ 1 బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఎన్నో ఉపయోగకరమైన ఉత్పత్తులను అందించిన హయర్… తన పోర్ట్ ఫోలియోను ఎప్పటికప్పుడు మరింత బలోపేతం చేసుకుంది. ఇప్పుడు రంజంగాన్ లోని ఫ్రీజర్ తయారీ యూనిట్ – పుణే ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఐ సర్టిఫికేషన్‌ను పొందడం ద్వారా మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ సర్టిఫికేషన్ ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేస్తుంది. హయర్ సంస్థ అందించే ఉత్పత్తులు భద్రత, మన్నిక , పనితీరు అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఈ సంస్థ ధృవీకరిస్తుంది. వినియోగదారులు హయర్ సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సర్టిఫికేషన్ నిర్ధారిస్తుంది.

ఐఎస్ఐ సర్టిఫికేషన్ వచ్చిన సందర్భంగా హయర్ ఇండియా అధ్యక్షులు ఎన్.ఎస్.సతీష్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “పుణేలో ఉన్న రంజంగావ్ లో ఉన్న మా తయారీ యూనిట్‌కు ఐఎస్ఐ సర్టిఫికేషన్ రావడం మాకు గర్వకారణం. ఈ విజయం అధిక-నాణ్యత అందించాలనే మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. వినియోగదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా ఉండే ఉపకరణాలు. ధృవీకరణ భద్రత, మన్నిక,పనితీరు పట్ల హయర్ అంకితభావాన్ని బలపరుస్తుంది. అదే సమయంలో పరిశ్రమలోని అత్యున్నత ప్రమాణాలకు మా కట్టుబడి ఉండడాన్ని ఉదాహరిస్తుంది” అని అన్నారు.

ప్రపంచంలోనే నెంబర్ వన్ డీప్ ఫ్రీజర్ బ్రాండ్‌గా ఉంది హయర్. సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన, వినూత్నమైన ఉత్పత్తులను పరిచయం చేయడం ద్వారా హయర్ తమ వినియోగదారుల జీవితాలను సులభతరం చేయడం కొనసాగిస్తోంది. హయర్ ఇండియా అందిస్తున్న ఉపకరణాల విషయానికి వస్తే, వీటిల్లో శక్తి సామర్థ్యం, విశ్వసనీయత చాలా ముఖ్య అంశాలు. బీఈఈ (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) ఆమోదించిన 5 స్టార్ రేటింగ్ మెషీన్లు ఈ రెండు అంశాల్లో రాణించాయి. హయర్ ఉత్పత్తులు పరిశ్రమలో అతి తక్కువ విద్యుత్ వినియోగానికి ప్రసిద్ధి చెందాయి. హయర్ డీప్ ఫ్రీజర్ సిరీస్ హార్డ్ టాప్ హోమ్ సెగ్మెంట్ (148-788 లీటర్), హెచ్‌టి కమర్షియల్, గ్లాస్ టాప్ (300-500 లీటర్), కాంబో చెస్ట్ ఫ్రీజర్, వీసీ కూలర్, వర్టికల్ ఫ్రీజర్ మరియు వైన్ చిల్లర్, ఈ 5-స్టార్ ఎనర్జీ-రేటెడ్ మెషీన్‌లు శక్తి వినియోగాన్ని తగ్గించడానికి రూపొందించబడ్డాయి. పనితీరులో రాజీ పడకుండా, అధునాతన సాంకేతికతలు, ఫీచర్లను పొందుపరచడం వీటి ప్రత్యేకతలు.

స్థానికంగా ఉండే వనరుల్ని ఉపయోగించుకుంటూ, దేశీయ తయారీని ప్రోత్సహించడం, తద్వారా స్వావలంబనను పెంపొందించడం ద్వారా భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవను హయర్ ఇండియా తూచా తప్పకుండా పాటిస్తుంది. అందువల్లే ప్రతిష్టాత్మక ఐఎస్ఐ ధృవీకరణను పొందింది. ప్రపంచ స్థాయి తయారీ యూనిట్‌ని స్థాపించడం, అలాగే ఐఎస్ఐ సర్టిఫికేషన్ పొందడం ద్వారా, హయర్ భారతీయ వినియోగదారులకు ప్రీమియం గృహోపకరణాలను అందిస్తూనే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అభివృద్ధికి దోహదపడుతుంది.

Leave a Reply