గోపీచంద్ పక్కా కమర్షియల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ …

పక్కా కమర్షియల్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ …

ఆరు అడుగుల అందగాడు , మొదటి సినిమా తొలివలపు సినిమా తో హీరోతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన గోపిచంద్ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో గా ఎదిగారు .. ఆరు అడుగుల ఎత్తు , మంచి ఫిజిక్ , చిన్న స్మైల్ , యాక్టింగ్ లో ఈజ్ , కామిడీ టైమంగ్ , తో ప్రేక్షకులను ఆకట్టుకొని థియేటర్స్ లో క్లాప్స్ , విజిల్స్ వేయగలిగే స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకున్నారు …గోపీచంద్ సినీ కెరీర్ తొలివలపు సినిమా తో స్టార్ట్ చేసిన , తానూ ప్రతినాయకుడిగా చేసిన జయం , నిజం , వర్షం సినిమాలతో బెస్ట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు .. పడి లేచిన కెరటం హీరో గోపీచంద్ , రొటీన్ కి బిన్నంగా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ , హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు .. ఒక్క సాలిడ్ స్క్రిప్ట్ , పడితే గోపీచంద్ ఫుల్ ఫామ్ లోకి వస్తాడు .. గోపీచంద్ మరియు డైరెక్టర్ శ్రీవాస్ ది హిట్ కాంబినేషన్ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం సీనిమా తరువాత 2104 లో లౌక్యం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు , లౌక్యం సినిమా తరువాత హీరో గోపీచంద్ చేసిన జిల్ , సౌఖ్యం , ఆక్సిజన్ , పంతం ,మరియు చాణుక్య సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంతగా విజయం సాధించలేకపోయాయి .. గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది ది కూడా హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు పడ్డాయి .. గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది కాబినేషన లో వచ్చిన రెండో సినిమా సీటీమార్‌ , స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .

సీటీమార్‌ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు గోపిచంద్ … సీటిమార్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో బౌన్స్ బ్యాక్ అయి వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు , ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా లో నటిస్తున్నారు .ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వైపు ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉండగా మరో వైపు పక్కా కమర్షియల్ సినిమాను కూడా ధియేటర్స్ లోకి త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది .. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు డేట్ ఫిక్స్ చేసుకొని చిన్న వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ . ఈ వీడియో లో గోపీచంద్ స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నారు .. పక్కా కమర్షియల్ సినిమా టీజర్ ఈనెల 8న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా పక్కా కమర్షియల్ టీమ్ అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి పక్కా కమర్షియల్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్సుమెంట్ రావడంతో గోపీచంద్ అభిమానులు సంతోషంగా ఉన్నారు …..