స్వర్ణ పతకం ముంగిట ధరణి-వడ్ల మల్లేష్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జూలై 21 2023: తెలంగాణకు చెందిన సెయిలర్లు ధరణి లావేటి– వడ్ల మల్లేష్, దీక్షిత కొమరవెల్లి, మధ్యప్రదేశ్​కు చెందిన ఏకవల్య బాతం హుస్సేన్​ సాగర్​ లో జరుగుతున్న మాన్​సూన్​ రెగ్గట్టా జాతీయ ర్యాంకింగ్​ చాంపియన్​ షిప్​లో అదరగొడుతున్నారు. మరో మూడు రేసులు మాత్రమే మిగిలుండగా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలను దాదాపు ఖాయం చేసుకున్నారు.

సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థిని ధరణి లావేటి ఎనిమిదేళ్ల క్రితం నాంది ఫౌండేషన్ నాన్హి కాళి కార్యక్రమంలో భాగంగా యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో చేరింది. వయసులో పెద్దది అయినప్పటికీ పెద్ద ఆమె ఇప్పటిదాకా తన చెల్లెలు, నేషనల్స్​ విజేత, ఇప్పటికి ఐదు దేశాల్లో జరిగిన పోటీల్లో భారత్​కు ప్రాతినిథ్యం వహించిన ఝాన్సీప్రియ లావేటి నీడలోనే ఉంది. ఇది వరకు 470 క్లాస్​ నేషనల్స్‌లో కాంస్యం మాత్రమే ఎన్నడూ ముఖ్యమైన జాతీయ ఛాంపియన్‌షిప్‌ గెలిచింది లేదు. చాలా అరుదుగా మాత్రమే పోడియం నిలుచునేది. అయితే, ఇన్నాళ్లు ఆమె పడ్డ కష్టానికి అదృష్టం కూడా తోడై ధరణి, వడ్ల మల్లేష్ ఇప్పుడు హుస్సేన్​ సాగర్​ లో జరుగుతున్న మాన్​సూన్​ రెగ్గట్టా జాతీయ ర్యాంకింగ్​ చాంపియన్​ షిప్​లో మరో మూడు రేసులు మాత్రమే మిగిలుండగా స్వర్ణ పతకం సాధించబోతున్నారు. ఈ జోడీ సమీప ప్రత్యర్థులు నైన్సీ రాయ్ –అనోరక్ షెండేలపై స్పష్టమైన 4 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.


వనపర్తికి చెందిన వడ్ల మల్లేష్ 11 సంవత్సరాల వయస్సులో యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లో చేరాడు. ఆ తర్వాత ఐఎన్​ఎస్ మండోవిలో నేవీ బాయ్ స్పోర్ట్స్ కంపెనీలో చేరడానికి ఎంపికయ్యాడు. తన గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసుకున్న మల్లేష్​ ఇప్పుడు అండర్-19 ఇంటర్నేషనల్ 420 క్లాస్ బోట్‌లో ధరణితో జతకట్టడానికి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. తమకు అలవాటైన హుస్సేన్​ సాగర్ అలలపై పోటీ పడుతూ నిన్న హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన ఈ జంట శుక్రవారం మరో రెండు రేసుల్లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఈ జంట స్వర్ణం కైవసం చేసుకోకుండా భూమిపై ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేనట్లు కనిపిస్తోంది.


మధ్యప్రదేశ్‌కు చెందిన నైన్సీ– అనిరాజ్ జంట రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కాంస్య పతకంపై గురిపెట్టిన స్థానిక అమ్మాయి రవళి పరండి– శ్రవణ్ కత్రావత్ శుక్రవారం పోటీల్లో రెండో స్థానంతో నిలిచారు. అయితే, మొదటి స్థానం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని దురదృష్టం వెంటాడింది. రెండో రేసులో మధ్యలో రవళి ఎడమ భుజం కండరంలో చీలిక రావడంతో ఇబ్బందిపడింది. తీవ్ర నొప్పితో బాధపడ్డ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎంతో కష్టపడి చిక్కినట్టే చిక్కిన కాంస్య పతకం వారి నుంచి దూరమడంతో ఆ జట్టు సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు.


ఇక, అండర్ 15 ఆప్టిమిస్ట్​ క్లాస్ బాలుర విభాగంలో మధ్యప్రదేశ్‌లోని ఎన్‌ఎస్‌ఎస్ కు చెందిన ఏకలవ్య బాతమ్​ అగ్రస్థానంలో నిలవగా, ఎన్‌బిఎస్‌సి గోవాకు చెందిన అజయ్ గజ్జి రెండు రేసుల్లో గెలిచి, మరో రేసులో రెండో స్థానం మొత్తంగా ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎన్‌బిఎస్‌సి గోవాకే చెందిన చెందిన శరణ్య యాదవ్‌ను మూడో స్థానానికి వచ్చాడు. అజయ్ వైసీహెచ్​ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.


అండర్ 15 ఆప్టిమిస్ట్​ క్లాస్ బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన దీక్షిత కొమరవెల్లి హవా నడుస్తోంది. తను అగ్రస్థానంలో ఉండగా.. ఎన్​ఎస్​ఎస్​ కు చెందిన షగున్ ఝా ఇద్దరి మధ్య ఆధిక్యాన్ని తగ్గించినప్పటికీ బంగారు పతకానికి దగ్గరగా రాలేకపోయింది. షగున్‌ రజత పతకానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మూడు రేసులు జరగనున్నాయి. ప్రస్తతానికైతే ధరణి– మల్లేష్, ఏకలవ్య, దీక్షితలకు బంగారు పతకాలు చిక్కనట్టే అనిపిస్తోంది.

నాలుగో రోజు పోటీ తర్వాత మాన్‌సూన్ రెగట్టా 2023 లీడర్‌బోర్డ్
అండర్ 19 ఇంటర్నేషనల్ క్లాస్
ధరణి లావేటి – వడ్ల మల్లేష్ తెలంగాణ            10 పాయింట్లు
నాన్సీ రాయ్ – అనిరాజ్ సెంధవ్ మధ్యప్రదేశ్ 14 పాయింట్లు
విద్యాన్షి మిశ్రా – మనీష్ శర్మ         మధ్యప్రదేశ్          27 పాయింట్లు
అండర్ 15 ఆప్టిమిస్ట్ క్లాస్ బాలికలు
ఏకలవ్య బాతం       మధ్యప్రదేశ్  12 పాయింట్లు
అజయ్ గజ్జి          ఎన్​బీఎస్​సీ  గోవా         23 పాయింట్లు
శరణ్య యాదవ్       ఎన్​బీఎస్​సీ గోవా          24 పాయింట్లు
అండర్ 15 ఆప్టిమిస్ట్ క్లాస్ బాలికలు
దీక్షిత కొమరవెల్లి తెలంగాణ                40 పాయింట్లు
షాగున్ ఝా               మధ్యప్రదేశ్     47 పాయింట్లు
శ్రేయా కృష్ణ            తమిళనాడు           107 పాయింట్లు

Leave a Reply