గీత మూవీ మోషన్ పోస్టర్ లాంచ్…

శ్రీ మ‌ణికంఠ సినీ క్రియేష‌న్స్ `గీత` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌ శ్రీ మ‌ణికంఠ సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై అభిజిత్ రామ్‌, శ్రీజ జంట‌గా కిర‌ణ్ తిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రాము, ముర‌ళి, ప‌ర‌మేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `గీత‌` (మ‌న కృష్ణ‌గాడి ప్రేమ‌క‌థ ట్యాగ్ లైన్). ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…“మోష‌న్ పోస్ట‌ర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ‌ ముచ్చ‌ట‌గా ఉంది. ఇటీవ‌ల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే థియేట‌ర్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు. చిన్న చిత్రాల వ‌ల్లే ఇండ‌స్ట్రీ బ‌తుకుతోంది. కాబ‌ట్టి చిన్న చిత్రాలు ఆడాలి, చిన్న చిత్రాలను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.టిఆర్‌య‌స్ పార్టీ స్టేట్ సెక్ర‌ట‌రీ భాస్క‌ర్ సాగ‌ర్ మాట్లాడుతూ…“క‌థాబ‌ల‌ముంటే కొత్త‌వారు న‌టించిన చిత్రాలైనా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. కొత్త‌వారు అంతా క‌లిసి చేస్తోన్న ఈ చిత్రం విజ‌యం సాధించాల‌న్నారు. నిర్మాత‌లు రాము, ముర‌ళి, ప‌ర‌మేష్ మాట్లాడుతూ….“గ్రామీణ నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థా చిత్రమిది. ల‌వ్ ,కామెడీ, యాక్ష‌న్ ఇలా ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన అన్ని అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. ద‌ర్శ‌కుడు చెప్పిన దానికంటే కూడా అద్భుతంగా చిత్రీక‌రించాడు. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మా సంస్థ‌లో వ‌స్తోన్న తొలి చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం“ అన్నారు.హీరో అభిజిత్ రామ్ మాట్లాడుతూ…“రేడియో మిర్చిలో ఆర్జే గా ప‌ని చేశాను. మా నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ఒక మంచి క‌థ‌తో సంప్ర‌దించారు. క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఈ సినిమా ప్రారంభించాం. శ్రీకాకుళం, ప‌లాస‌, ఉద్దానం, వైజాగ్‌, ఒరిస్సా , హైద‌రాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. టీమ్ అంతా ఎంతో ప్యాష‌నేట్ గా ప‌ని చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా“ అన్నారు. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ తిమ్మ‌ల మాట్లాడుతూ…“టీవీ ఛాన‌ల్లో నేను రిపోర్ట‌ర్ గా జ‌ర్నీ ప్రారంభించాను. ద‌ర్శ‌కుడు అవ్వాల‌న్న‌ది నా లక్ష్యం కావ‌డంతో ఒక మంచి క‌థ‌ రెడీ చేసుకుని మా నిర్మాత‌ల‌కు చెప్పాను. క‌థ వారికి న‌చ్చ‌డంతో వెంట‌నే షూటింగ్ ప్రారంభించాం. హీరో హీరోయిన్స్ నేను రాసుకున్న కథ‌కు ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ‌కు ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత పెట్టారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే స్వ‌ఛ్చ‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది“ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః భాస్క‌ర్ డోర్నాల‌; ఫైట్స్ః బాబ్జీ; సంగీతంః నేదునూరి ర‌మ‌ణ‌సాయి; ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ః స‌తీష్‌; నిర్మాత‌లుః రాము, ముర‌ళి, ప‌ర‌మేష్‌; ద‌ర్శ‌కత్వంః కిర‌ణ్ తిమ్మ‌ల‌;