ముగిసిన గండిపేట పల్లవి స్కూల్ సీబీఎస్సీ క్లస్టర్స్ VII @కబడ్డీ టోర్నమెంట్‌..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 16,2023: గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 2023, అక్టోబర్ 14న ప్రారంభమైన సీబీఎస్సీ క్లస్టర్స్ VII కబడ్డీ టోర్నమెంట్ అక్టోబర్ 16వరకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సీఓఓ మల్కా యశస్వి, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి హేమ మాడభూషి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి మీను ప్రారంభించారు. అయితే దీని ముగింపు వేడుక అక్టోబర్ 16న వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి 56 పాఠశాలలు హాజరయ్యాయి. ఇందులో దాదాపు 987 మంది బాలురు మరియు బాలికలు పాల్గొన్నారు. వారు 84 జట్లుగా విభజించబడ్డారు. ఇందులో బాలురు 54 జట్లు మరియు బాలికలు 30 జట్లుగా మారి కబడ్డీ మ్యాచ్ లు ఆడారు.

ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ ఎస్‌ఆర్‌ ప్రేమ్‌రాజ్‌, గౌరవ అతిథిగా డీపీఎస్‌ నాచారం క్రీడా విద్యా సలహాదారు డాక్టర్‌ ఎం. వెంకటేశ్వరరెడ్డి ఆటల్లో గెలిచిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్‌లను అందజేశారు.
బాలికల విభాగంలో మొదటి బహుమతైన స్వర్ణాన్ని తోటపల్లిలోని హీల్‌ స్కూల్‌, రెండో బహుమతైన రజతాన్ని రంగారెడ్డి జిల్లా హార్ట్‌ఫుల్‌నెస్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, మూడో బహుమతైన కాంస్యాన్ని మియాపూర్‌లోని మాతృశ్రీ డీఏవీ స్కూల్‌, ఖమ్మంలోనిహార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఇద్దరూ సంయుక్త గెలిచి విజేతలుగా నిలిచారు.

బాలురవిభాగంలో స్వర్ణాన్ని శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ (వైజాగ్), రజతాన్ని తోటపల్లిలోని హీల్ స్కూల్, కాంస్యాన్ని ఇద్దరు ఉమ్మడి విజేతలు గెలుచుకున్నారు, వారు ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ మరియు సికింద్రాబాద్‌లోని సిఆర్‌పిఎఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందినవారు.

ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ ఈ కార్యక్రమానికి భారీగా స్పందన రావడంతో చాలా సంతోషించారు. అలాగే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, గండిపేట యాజమాన్యాన్ని అభినందించారు. డాక్టర్ ఎం.వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు ఇలాంటి మైదానాలు,మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, అమ్మాయిలు, అబ్బాయిలు క్రీడల్లో బాగా రాణించి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.

ఈ ముగింపు వేడుకలో చివరగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి హేమ మాడభూషి మాట్లాడుతూ.. ఈ మూడు రోజులు తమ స్కూల్లోని టోర్నమెంట్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన డా.ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్, డా.ఎం.వెంకటేశ్వర రెడ్డి, కబడ్డీ కోచ్ లు, రిఫరీలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు. అలాగే గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ క్రీడా విభాగం నిర్వాహకులు ప్రసాద్ టీమ్‌ను ఆమె అభినందించారు.

Leave a Reply