నూరుశాతం ఈవీ రుణాల కోసం.. గ్రీవ్స్ ఫైనాన్స్ నుంచి “evfin”

తెలుగు సూపర్ న్యూస్,హైద‌రాబాద్, ఏప్రిల్ 5, 2024: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) గ్రీవ్స్ ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో “evfin”అనే తన అద్భుతమైన ఫైనాన్షియల్ ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇతర సుస్థిర పరిష్కారాలకు అంకితమైన భారతదేశపు మొట్టమొదటి కన్స్యూమర్ ఫైనాన్స్ లెండింగ్ ప్లాట్‌ఫాం ఇది. అధునాతన డిజిటల్ సూట్, సృజనాత్మక ఆస్తుల నిర్వహణ పరిష్కారాల మద్దతు దీనికి ఉన్నాయి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు క్ర‌మంగా పెరుగుతున్న ఆద‌ర‌ణ నేప‌థ్యంలో.. ఈ మార్పును మ‌రింత వేగవంతం చేయడానికి, వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, దాని జీవిత‌కాలం గురించి పూర్తిస్థాయి స‌మాచారం అందించ‌డం చాలా ముఖ్యం.  ఈ విష‌యంలో “evfin”అపూర్వమైన వినూత్న అనుభవాలను అందిస్తుంది. ఈ సూట్ వ‌ల్ల ఈవీ మీ చేతిలో ఉన్న‌న్నాళ్లూ మెరుగైన ప్ర‌యాణం అందేలా నిర్ధారిస్తుంది. వినియోగ‌దారుల‌కు అందుబాటు, తక్కువ ఖర్చుతో కూడిన ఫైనాన్సింగ్ ఆప్ష‌న్స్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మార్పును వేగవంతం చేయడానికి, ఈ స‌రికొత్త ఆర్థిక చొరవను స్వీకరించిన నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది.

ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో ఒకటైన ఏథర్ ఎనర్జీతో “evfin”త‌న భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గ్రీవ్స్ నుంచి ఆంపియర్, హీరో మోటార్ కార్పొరేషన్ నుంచి విడా, ఓలా ఎలక్ట్రిక్, ఇంకా మీ నగరంలోని టీవీఎస్ ఐక్యూబ్ లాంటి అన్ని ప్రముఖ ఈవీ టూ వీలర్ ఓఈఎం డీలర్‌షిప్‌ల‌లో కూడా “evfin” ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

ఈవీఫిన్ వినియోగదారులకు వారి వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చడానికి అనుకూలంగా ఉండే విభిన్న శ్రేణి ఫైనాన్సింగ్ పరిష్కారాలను ప్రత్యేకంగా అందిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడం, కొత్త ఈవీ యజమానులకు సౌలభ్యం, ఆకర్షణను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

బైబ్యాక్, అప్ గ్రేడ్ పై ప్రధానంగా దృష్టి సారించి, విభిన్న రకాల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించిన క్యూరేటెడ్ ఫైనాన్సింగ్ పథకాలను యాక్సెస్ చేసుకునే ప్రత్యేక సౌలభ్యం ఈవిఫిన్ వినియోగదారులకు ఉంటుంది.

అతి తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తున్న వారికి జిప్.ఫిన్, ప‌ర్యావ‌ర‌ణ అనుకూలంగా, చౌకగా ఉండాల‌నుకునే వారికి ఎకో.ఫిన్, భరోసాతో కూడిన బైబ్యాక్ ఆప్షన్లతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రారంభ విన‌యోగ‌దారులకు స్మార్ట్.ఫిన్, తక్కువ ఈఎంఐల కోసం చూస్తున్న రోజువారీ ప్రయాణికులకు రైడ్.ఫిన్, భరోసా కోరుకునే వారికి రక్షణ.ఫిన్ వంటి ఆప్షన్లు “evfin” ఉన్నాయి. ఈ ఎంపికలు కొంతమందికి వారి ఆర్థిక లక్ష్యాలు, మొత్తం మానసిక ప్రశాంతతకు ఏది బాగా సరిపోతుందో ఎంచుకోవడానికి అనుమతిస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకునేటప్పుడు వినియోగదారుల ఆందోళనలను పరిష్కరించడానికి రూపొందించిన వినూత్న విధానం, ప్రత్యేక ఫీచర్లు, సేవల ద్వారా ఎలక్ట్రిక్ ఫైనాన్సింగ్ కాస్త విభిన్నంగా ఉంటుంది. వారి ఆందోళనలను పరిష్కరించడానికి, వ్యక్తిగత అవసరాలు, పరిస్థితుల ఆధారంగా కస్టమ్ సిఫార్సులను అందించే “సహాయక కొనుగోలు” ను అందించాలని ఈవీఫిన్ ప్రతిపాదిస్తుంది. ఈ వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం వినియోగ‌దారుల‌కు ఈవీ కొనుగోళ్ల విష‌యంలో గ‌ణ‌నీయంగా సహాయపడుతుంది. ఇందులోని ప్రొటెక్ష‌న్ ప్లాన్స్ వ‌ల్ల అద‌న‌పు వారంటీలు, లాక్డ్ ఇన్ రీసేల్ ధ‌ర‌లతో పాటు వినియోగ‌దారుల‌కు త‌మ ఈవీ త‌న విలువ‌ను అలా కొన‌సాగిస్తుంద‌న్న విశ్వాసం ల‌భిస్తుంది.

“evfin”, ఎథర్ ఎనర్జీ మధ్య భాగస్వామ్యం దేశం హ‌రిత‌,  సుస్థిర భవిష్యత్తు వైపు వెళ్లేలా చేస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ స్వీకరణను వేగవంతం చేయడంలో వారి నిబద్ధతకు ఇది నిదర్శనం. ఈ సహకారం ఈవీ యాజమాన్యాన్ని సులభతరం చేస్తుంది, పరిశుభ్రమైన వాతావరణానికి దోహదం చేస్తుంది.