గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లోని ‘నేత్ర-ఆర్ట్ కాంక్లేవ్’ కు అద్భుతమైన స్పందన..

తెలుగు సూపర్ న్యూస్,గండిపేట,నవంబర్ 5,2023: గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అద్భుతమైన ఆవిష్కరణకు వేడుకైంది. విద్యార్థుల్లోని ప్రతిభాపాటవాలను వెలికి తీసే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ను ఘనంగా నిర్వహించింది స్కూల్ యాజమాన్యం. 2023, నవంబర్ 3, 4 తేదీల్లో జరిగిన ఈ ‘నేత్ర-ఆర్ట్ కాంక్లేవ్’కు అద్భుతమైన ఆదరణ లభించింది.ఈ ఇంటర్ స్కూల్ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి మొత్తం 93మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను మొదట రెండు వర్గాలుగా విభజించారు. పోటీ విభాగాల గురించి చెప్పాలంటే.. డూడ్లింగ్, ఇకెబానా, గిఫ్ట్ ర్యాపింగ్, ఫేస్ పెయింటింగ్, మ్యాక్రేమ్, గ్రాఫిటీ మొదలైన వాటిపైపోటీలు జరిగాయి. వీటిలో విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభను కనిబరిచారు. ఎంతో ఉత్సాహంతో

పాల్గొని అతిథులను, న్యాయనిర్ణేతలను మెప్పించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా ప్రముఖ సీనియర్ ఆర్ట్ టీచర్,జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీతశ్రీ రాజేశ్ కుమార్ పామువ్యవహరించారు.


అలాగే రెండో రోజు అంటే నవంబర్ 4వ తేదీననేత్ర ఆర్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించబడింది. ఆ కార్యక్రమాన్ని విశిష్ట పురస్కారం,2023 వందేభారత్ భీష్మ విశిష్ట పురస్కారం అందుకున్న శ్రీ రమణారెడ్డి ప్రారంభించారు. ఆయనను ఇదే వేదికపై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ , పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఓఓ శ్రీ మల్కా యశస్వి, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి హేమ మాడభూషి సత్కరించారు. శ్రీ ఎంవీ రమణారెడ్డి ప్రసంగిస్తూ.. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఆర్ట్ ఫెస్ట్‌ను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు.


ఈ కార్యక్రమం అనంతరం ఇంటర్‌ స్కూల్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ట్రోఫీలను అందజేశారు. ప్రిన్సిపాల్ శ్రీమతి హేమ మాడభూషి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి మీనులు ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీ రమణారెడ్డి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గ్యాలరీలను సందర్శించారు. ఈ సుందరమైన కార్యక్రమానికి గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆర్ట్ టీచర్లు శ్రీ వాసుదేవ్ రావు, శ్రీ సతీష్ , క్రాఫ్ట్ టీచర్ శ్రీమతి నమ్రత ,టీచర్లు,పీఈ టీమ్ అందరూ సహకరించినందుకు వాళ్లను ప్రిన్సిపాల్ అభినందించారు.

Leave a Reply