ఫౌండేషన్ బ్యాచ్ కోసం విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన యూరోస్కూల్ మెట్రో గార్డెన్ క్యాంపస్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జూన్ 28, 2023: కూకట్‌పల్లిలోని యూరోస్కూల్ మెట్రో గార్డెన్ తన ఫౌండింగ్ బ్యాచ్ కోసం జూన్ 22, 2023న అకడమిక్ సెషన్‌ను ప్రారంభించింది. యూరోస్కూల్ హైటెక్ తర్వాత ఇది హైదరాబాద్ నగరంలోని రెండో యూరోస్కూల్ క్యాంపస్. ఇది ఏటేటా 10వ తరగతి బోర్డు పరీక్షలలో విజయవంతమైన విద్యా రికార్డులను కలిగి ఉంది. కొత్త యూరోస్కూల్ మెట్రో గార్డెన్ క్యాంపస్ పిల్లలు స్వయంగా కనుగొనేందుకు ఉత్తేజపరిచే మార్గాలను అందిం చే వాతావరణంలో అనుభవపూర్వక అభ్యాస అవకాశాల ప్రపంచానికి పిల్లలకు యాక్సెస్ ను అందించడానికి వీలుగా నిర్మించబడింది.

3.5 ఎకరాల క్యాంపస్‌లో టెక్-ఎనేబుల్డ్ క్లాస్‌రూమ్‌లు, క్రీడలు, లలిత కళలలో అ త్యాధునిక సౌకర్యాలు, 600-సీట్ల ఆడిటోరియం, అన్ని సదుపాయాలతో కూడిన పిల్లల-స్నేహపూర్వక ఆట స్థలం ఉన్నాయి. క్యాంపస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి నవతరం నైపుణ్యాల అభివృద్ధితో విద్యార్థులను సన్న ద్ధం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా మెట్రో గార్డెన్‌లోని యూరో స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి విష్ణు వందన మాట్లాడుతూ, “యూరో స్కూల్ మెట్రో గార్డెన్‌కు మా ఫౌండింగ్ బ్యాచ్‌ని స్వాగతిస్తున్నందున ఇది మాకు గర్వకారణ సందర్భం. మా క్యాంపస్ 2000 మందికి పైగా విద్యార్థులకు వసతి కల్పించేలా రూపొందించబడింది.

జూనియర్ కేజీ నుండి గ్రేడ్ 10 వరకు. ఇది సీబీఎస్ఈ బోర్డ్‌ కు అనుబంధంగా ఉంది. మా పాఠ్యాంశాల ద్వారా, మేం తల్లిదండ్రులు, వి ద్యార్థులకు 21వ శతాబ్దపు పాఠ్యాంశాలు, బహుముఖ మౌలిక సదుపాయాలు, అత్యంత అనుభవజ్ఞులైన ఉ పాధ్యాయులు ఉన్న పాఠశాల వ్యవస్థను అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

మేం ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారం భించినప్పుడు, విద్యలో ప్రపంచ ప్రమాణాల ప్రాముఖ్యతను, మన పిల్లల జీవితాలపై దాని ప్రభావాన్ని గు ర్తించాం. మా కొత్త పాఠశాల మా విద్యార్థులకు ఆశ, అవకాశాలను అందిస్తుంది. మేం మా ఫౌండింగ్ బ్యాచ్ విద్యా ర్థులను స్వాగతించడానికి, కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం”’’ అని అన్నారు. ’’

రోబోటిక్స్, డ్యాన్స్, యోగాతో పాటు, యూరోస్కూల్ మెట్రో గార్డెన్ క్యాంపస్ ASPIRE ప్రోగ్రామ్‌ను అందిస్తుంది – ఇది విద్యార్థులు క్రీడలు, లలిత కళలలో ఎంచుకోగల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రోగ్రామ్‌ల భాగ స్వామ్యంతో ఉంటుంది.

ఇది బార్కా అకాడమీ (ఫుట్‌బాల్), టోరిన్స్, హెలెన్ ఓ’గ్రాడీ, ఎన్బీఏ బాస్కెట్‌బాల్ అకాడమీ, వరల్డ్ స్విమ్ వంటి ప్రపంచ సంస్థల భాగస్వామ్యంతో నడుస్తుంది. యోగా, రోబోటిక్స్, డ్యాన్స్, డ్రామా, స్విమ్మింగ్, స్పోర్ట్స్, కళలు, భాషలు వంటి కార్యకలాపాలను అందిస్తుంది. క్యాంపస్‌లో ఒలింపిక్ సైజులో సగం ఉండే స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ రింగ్, క్రికెట్ పిచ్, బాస్కెట్‌బాల్ కోర్ట్, పూర్తిస్థాయి ఫుట్‌బాల్ గ్రౌండ్, టెన్నిస్ కోర్ట్ ఉన్నాయి.

Leave a Reply