భారత్ బెంజ్ సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌లో తన నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచిన డిఐసివి

తెలుగు సూపర్ న్యూస్,చెన్నై,డిసెంబర్ 6,2023: డైమ్లర్ ట్రక్ ఏజీ (“Daimler Truck”) పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ, డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రై.లి. లిమిటెడ్ (DICV), తన భారత్‌బెంజ్ విక్రయాలు,సేవా నెట్‌వర్క్‌లో సాంకేతిక సిబ్బంది సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.

డీలర్ భాగస్వాములైన ధింగ్రా ట్రక్కింగ్,ఆటోబాన్ ట్రకింగ్‌ల సహకారంతో, డిఐసివి
(DICV) మరో రెండు భారత్‌ బెంజ్ ప్రాంతీయ శిక్షణా కేంద్రాలను (RTC) ఒకటి ధరుహేరా
(హర్యానా)లో,మరొకటి పుణె (మహారాష్ట్ర)లో ప్రారంభించింది. ఇప్పటికే చెన్నై, ఓడిశాలో
ఉన్న రెండు ప్రాంతీయ శిక్షణ కేంద్రాల ద్వారా ఏడాదికి భారత్‌ బెంజ్ నెట్‌వర్క్‌లోని 3500
మందికి పైగా డ్రైవర్లకు, సేల్స్ , సర్వీస్ సిబ్బందికి నైపుణ్యం, కౌశల్యాన్ని వృద్ధి
చేసుంకునేందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు సమగ్ర ఉత్పత్తి పరిజ్ఞానం,
అధునాతన ఉత్పత్తి, కస్టమర్ సర్వీసింగ్ నైపుణ్యాలు, తదితర ఉపయుక్త సర్వీసింగ్ నైపుణ్యాలు,
అవసరమైన సాధనాలను అందించేందుకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ డొమెస్టిక్ సేల్స్, కస్టమర్ సర్వీస్ ప్రెసిడెంట్,చీఫ్
బిజినెస్ ఆఫీసర్ శ్రీరామ్ వెంకటేశ్వరన్ మాట్లాడుతూ, ‘‘భారత్ బెంజ్ ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు
మా అధీకృత డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్‌లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేశాము.
గత నాలుగేళ్లుగా మేము సుమారు 15,000 మంది భారత్ బెంజ్ సాంకేతిక నిపుణులు, సేల్స్
సిబ్బంది.

డ్రైవర్‌లకు శిక్షణ ఇచ్చాము. శ్రేష్ఠతను సాధించడం అనేది నిరంతర, స్థిరమైన ప్రక్రియ అని మేము విశ్వసిస్తున్నాము. భారత్ బెంజ్ బ్రాండ్ ప్రారంభించినప్పటి నుంచి దీన్ని గమనిస్తూనే వస్తున్నాము. నాణ్యత ప్రమాణాలను చేరుకుంటూనే మేము ఈ స్థాయిని నిలకడగా వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. రానున్న ఏడాదులలో భారత్‌బెంజ్ కొత్త పుంతలు తొక్కుతూ
అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సిబ్బంది మరింత సామర్థ్యం, కౌశల్యంతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది’’ అని వివరించారు.

ధారుహేరాలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం (RTC), ధింగ్రా ట్రక్కింగ్ భాగస్వామ్యంతో 6,600
చ.అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. పుణెలోని ఆటోబాన్ ట్రక్కింగ్-ఆధారిత కేంద్రం 7,800 చ.
అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ రెండు కేంద్రాలు ఏకకాలంలో 60 మంది ట్రైనీలకు వసతితో కూడిన
శిక్షణ అందిస్తుండగా, ఇందులో ఇద్దరు ప్రత్యేక తర్ఫీదుదారులు ఉన్నారు. సగటున రెండు BS6
వాహనాలు, 10 ట్రక్కులు,బస్సులకు కావలసిన 500+ పరికరాలు అందుబాటులో
ఉన్నాయి. ఈ సెటప్ డిఐసివి (DICV) వాహనాలు,వాటి భాగాలను అందించే హామీతో,
అత్యున్నత స్థాయి సాంకేతిక శిక్షణను సరళం చేస్తుంది.

ఈ సిబ్బంది నైపుణ్యాలు, సామర్థ్యాలను మరింత మెరుగుపరచేందుకు డిఐసివి (DICV) తమ వారి
సిబ్బంది నైపుణ్యాన్ని రియల్ టైమ్‌లో పరీక్షించేందుకు భారత్‌బెంజ్ జాతీయ నైపుణ్యాల పోటీని
నిర్వహిస్తుంది. భారత్ బెంజ్ నేషనల్ స్కిల్స్ కాంటెస్ట్ ద్వారా వినియోగదారుని అనుభవాన్ని
మెరుగుపరచేందుకు డీలర్‌షిప్ సేల్స్, సర్వీస్ టీమ్‌ల జ్ఞానం, మైండ్‌సెట్, నైపుణ్యాలు,
సాధనాలను అంచనా వేయడం.మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. పోటీ ప్రభావం
డిఐసివి (DICV) ‘భారత్‌ బెంజ్ రక్షణ’ వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది
సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరిత సేవలను అందించేలా రూపొందించారు. భారత్‌ బెంజ్

ట్రక్కులు ఏ సమయంలోనైనా తిరిగి రోడ్డుపైకి వచ్చేలా చేయడం ద్వారా వినియోగదారుల వ్యాపార
వృద్ధి,లాభదాయకతపై సానుకూల ప్రభావం చూపుతుంది. భారత్‌ బెంజ్ నేషనల్ స్కిల్ కాంటెస్ట్ 2023, 750+ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు,2650+సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 3400+ అభ్యర్థుల నుంచి విశేషమైన 99% భాగస్వామ్య రేటును సాధించి పరిశ్రమలో కొత్త కొలమానాలను నెలకొల్పింది.

దీనిపై శ్రీరామ్ వెంకటేశ్వరన్ మరింత వివరిస్తూ, “మేము ప్రాంతీయ శిక్షణా కేంద్రాలలో మా
సిబ్బందికి శిక్షణ ఇస్తూనే, మా భారత్‌ బెంజ్ జాతీయ నైపుణ్య పోటీని మేము మా ప్రాంగణంలో
నిర్వహిస్తాము. కఠిన పరిస్థితులలో మెరుగైన సేవలు అందించేందుకు, మా సిబ్బందికి వారు చేసే
పనిలో అద్భుతమైన శిక్షణనిచ్చాము.

నేషనల్ స్కిల్స్ కాంటెస్ట్ 2023 అద్భుతమైన భాగస్వామ్యాన్ని సాధించింది. క్రాస్-లెర్నింగ్ మరియు ఇన్నోవేషన్ ప్రాముఖ్యతను బలోపేతం చేసింది. ఇది మా ఇ-లెర్నింగ్ మాడ్యూల్స్‌తో సహా మా డిజిటలైజేషన్ చొరవ, సిమ్యులేటెడ్ డ్రైవర్ ట్రైనర్ (SDT)ని భర్తీ చేస్తుంది. ఇవి భద్రత సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో ట్రక్, బస్ డ్రైవింగ్, టెక్నిక్‌లను ఆధునీకరించే లక్ష్యంతో ఉన్నాయి’’ అని వివరించారు.


భారత్‌ బెంజ్ తన భారతీయ వినియోగదారులకు రక్షణ, భారత్‌ బెంజ్ ఎక్ఛేంజ్,భారత్‌
బెంజ్ సర్టిఫైడ్ వంటి కార్యక్రమాల ద్వారా అసాధారణమైన సేవలను అందిస్తుంది. రక్షణ
కార్యక్రమం అనేది మా అధీకృత సేవా కేంద్రాలలో 48 గంటలలోపు సర్వీస్, రిపేర్ పనులను పూర్తి
చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అప్‌టైమ్ హామీ కార్యక్రమం. ప్రధాన రహదారుల వెంట
సౌకర్యవంతంగా ఉన్న డీలర్‌షిప్‌లు, సర్వీస్ స్టేషన్‌లు వినియోగదారులు అందరికీ అందుబాటులో
ఉంటాయి.

భారత్‌ బెంజ్ ఎక్ఛేంజ్ అనేది ఏదైనా ఇతర బ్రాండ్ ఉపయోగించిన ట్రక్కుకు బదులుగా
వినియోగదారులకు కొత్త భారత్‌ బెంజ్ ట్రక్కును అందించే ప్రోగ్రామ్. భారత్‌ బెంజ్ సర్టిఫైడ్ ఒక
వాణిజ్య వాహనం యొసాధారణ లైఫ్ సైకిల్‌కి మించి వినియోగదారులకు సేవలందించే ప్రీ-ఓన్డ్
భారత్‌ బెంజ్ ట్రక్కులను పునరుద్ధరిస్తూ, రిటైల్ చేస్తుంది.

భారతదేశం వ్యాప్తంగా అంతటా 330+ అవుట్‌లెట్‌లతో, భారత్‌ బెంజ్ విస్తృతమైన
నెట్‌వర్క్‌తో, గోల్డెన్ చతుర్భుజంతో సహా కీలకమైన జాతీయ రహదారులను కవర్ చేస్తుంది. ఈ
మార్గాల్లో వినియోగదారులకు 2 గంటలలోపు సహాయాన్ని అందజేస్తుంది.

Leave a Reply