టాటా ఐపీఎల్‌ 2023కు అపూర్వమైన స్పందనను అందుకున్న డిస్నీ స్టార్‌, 29% పెరిగిన రేటింగ్స్‌

TATA IPL 2023,

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్‌, 3 ఏప్రిల్‌ 2023 : టాటా  ఐపీఎల్‌ 2023 కు అధికారిక టెలివిజన్‌ ప్రసారకర్త డిస్నీ స్టార్‌ , మొత్తం మీద 8.7 బిలియన్‌ నిమిషాల వినియోగాన్ని టీవీపై ఈ టోర్నమెంట్‌ ప్రారంభ మ్యాచ్‌లో చూడటంతో పాటుగా గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 47% వృద్ధిని  నమోదు చేసింది. ప్రారంభ దినోత్సవం నాడు 140 మిలియన్ల మంది వీక్షకులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. దీనిలో ప్రారంభోత్సవ వేడుకలను 130 మిలియన్‌ల మంది వీక్షకులు చూడటంతో పాటుగా  గుజరాత్‌ టైటన్స్‌ మరియు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ను సైతం వీక్షించారు.

‘‘ఐపీఎల్‌ ఆన్‌ స్టార్‌కు దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి లభించిన అపూర్వ స్పందన పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.  వీక్షణ సమయం పరంగా లభించిన భారీ వృద్ధి, మా ప్రచారం సాధించిన విజయానికి ప్రతీకగా నిలువడంతో పాటుగా  స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రసారాల యొక్క సద్గుణాలను పెంపొందించడం, ప్రత్యక్ష్య క్రికెట్‌ను అంతరాయం లేకుండా వీక్షించడానికి ఇష్టపడే వేదికగా లీనియర్‌ టెలివిజన్‌ ఆధిపత్యాన్ని కొనసాగించడం, అన్నిటికంటే ముఖ్యంగా క్రికెట్‌ అభిమానులతో మేము పంచుకునే లోతైన సంబంధాన్ని ప్రదర్శించింది.  ఇది ప్రీమియం క్రికెట్‌ టోర్నమెంట్‌గా  ప్రపంచంలో టాటా  ఐపీఎల్‌ సాధించిన ఖ్యాతిని సైతం ఇది పునరుద్ఘాటిస్తుంది. స్టోరీ టెల్లింగ్‌ శక్తి, అత్యుత్తమ శ్రేణి కవరేజీ, కస్టమైజేషన్‌తో  అభిమానులకు సేవలను  అందించాలనే మా నిబద్ధతను కొనసాగించనున్నాము’’ అని డిస్నీ స్టార్‌  హెడ్‌–స్పోర్ట్స్‌, సంజోగ్‌ గుప్తా అన్నారు.

TATA IPL 2023,

క్రీడల కోసం ఫ్యాన్‌డమ్‌,వ్యూయర్‌షిప్‌ను సృష్టించడంలో స్టార్‌ స్పోర్ట్స్‌ ముందుంది. దీని అభిమానుల కేంద్రీకృత విధానంలో , ప్రాంతాల వారీ నిర్ధిష్టమైన ఫీడ్స్‌ను తొమ్మిది భాషలలో సృష్టించడంతో పాటుగా సామాజిక–సాంస్కృతిక సూక్ష్మ నైపుణ్యాలు ,క్రీడా వాస్తవాలకు చక్కగా ట్యూన్‌ చేయబడింది. ఇది అనేక ప్రాంతాలలో క్రికెట్‌ వీక్షకుల సంఖ్యను పెంచింది. విభిన్నమైన స్టార్‌కాస్ట్‌లో మాజీక్రికెటర్లు, సీజన్డ్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌  టాటా ఐపీఎల్‌ 2023 ను విభిన్న భాషలలో సమర్పిస్తున్నారు. వీరు స్టార్‌ స్పోర్ట్స్‌ ఐపీఎల్‌ సూత్రధార్‌ – రన్‌వీర్‌ సింగ్‌, లెజండరీ తెలుగు నటుడు నందమూరి  బాలకృష్ణ లు ఈ బ్రాడ్‌కాస్ట్‌పై సూపర్‌ అభిమానులకు ప్రాతినిధ్యం వహించనున్నారు.

తమ కార్యకలాపాలన్నింటిలోనూ అత్యంత కీలకంగా అభిమానులను స్టార్‌ స్పోర్ట్స్‌ భావిస్తుంది,లీనమయ్యే అభిమాన అనుభవాలను ఫ్యాన్‌బస్‌ లాంటి ఆన్‌ గ్రౌండ్‌ అనుభవాలతో అందిస్తుంది. అక్కడ అభిమానులు స్టార్‌ స్పోర్ట్స్‌తో చేరడంతో పాటుగా ఇంటరాక్ట్‌ కావొచ్చు.  ఈ బ్రాడ్‌కాస్టర్‌ ఇప్పుడు కలిసి వీక్షించడంలోని ఆనందాన్ని సైతం అభిమానుల ఇంటి ముంగికు తీసుకువచ్చారు. తద్వారా లీనమయ్యే అభిమానుల అనుభవాలను హర్‌ సొసైటీ బనేగా స్టేడియంతో సాధ్యం చేసింది. అక్కడ స్టార్‌స్పోర్ట్స్‌ నిపుణులు దేశవ్యాప్తంగా నిర్వహించిన స్ర్కీనింగ్‌లో  భాగస్వాములవుతారు.  ఈ బ్రాడ్‌కాస్టర్‌ ఇప్పుడు అతిపెద్ద స్కూల్‌ క్రికెట్‌ క్విజ్‌ ను సైతం ప్రారంభించారు. ఈ వైవిధ్యమైన లీగ్‌ క్విజ్‌ లో 20వేల మందికి పైగా విద్యార్ధులు పాల్గొన్నారు.  ఆస్క్‌ స్టార్‌ ఇప్పుడు నూతన అవతార్‌లో లభిస్తుంది. అభిమానులు కామెంటేటర్లకు తమ ప్రశ్నలను సంధించడం ద్వారా జవాబులు పొందవచ్చు.  ఈ ప్రశ్నలను ప్రత్యక్ష ప్రసార సమయంలో కూడా చూపుతారు.

షోర్‌ ఆన్‌,గేమ్‌ ఆన్‌ ప్రచారాన్ని సైతం స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రారంభించింది.  ఇది గణనీయమైన ఉత్సాహాన్ని  సృష్టించడంతో పాటుగా టోర్నమెంట్‌కు ముందు తగిన మద్దతునూ అందించింది. ఈ ప్రచారంలో అభిమానుల అభిరుచి, ఉత్సాహం, ఏకత్వం, ఫీల్డ్‌లో తమ అభిమానులు చేరుకునే అద్వితీయ క్షణాలు వంటివి చూపారు.  ఈ ప్రచార చిత్రంలో సూపర్‌స్టార్స్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ ప్యాండ్యా, రవీంద్ర జడేజా, కెఎల్‌ రాహుల్‌ పాల్గొనడంతో పాటుగా సోషల్‌ మీడియాలో సంచలనాలను సృష్టించారు. అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేయగా, తమ అభిమాన టీమ్‌లను సైతం వారు వెల్లడించారు.

TATA IPL 2023,

 స్టార్‌ స్పోర్ట్స్‌ ఇప్పుడు ప్రత్యేకంగా స్టార్స్‌ ఆన్‌ స్టార్‌ను సైతం ప్రారంభించింది. ఇది వీక్షకులకు వినూత్నమైన అవకాశాన్ని అందించడం ద్వారా  తమ అభిమాన హీరోలను వ్యక్తిగత స్ధాయిలో తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ ప్రసారకర్త తమ ప్రయత్నాలను  ఏకీకృతం చేయడంతో పాటుగా ఐపీఎల్‌ను ప్రత్యేకంగా మలిచే సూపర్‌ అభిమానులను వేడుక చేశారు మరియు ఈ స్పందన అపూర్వం. దాదాపు 200 మిలియన్‌ల మంది వీక్షకులు టాటా ఐపీఎల్‌ 2023 కోసం బిల్డ్‌ అప్‌ ప్రోగ్రామ్‌ను వీక్షించారు. శుక్రవారం ఈ టోర్నమెంట్‌ ప్రారంభం కాక మునుపే దీనిని ఇంత మంది వీక్షకులు చూశారు.  ప్రత్యక్ష ప్రసారానికి ఆవల ఈ  టోర్నమెంట్‌ కవరేజీని  విస్తరించాలనే స్టార్‌స్పోర్ట్స్‌  నిబద్ధతకు ఇది నిదర్శనం.

ఈ టోర్నమెంట్‌ ఎన్నో మలుపులు, ఉద్విగ్నభరిత క్షణాలు, అందించగలదని అంచనా.  టెలివిజన్‌పై యాక్షన్‌ను అభిమానులు  ఆస్వాదించడం వల్ల  ఈ  షోర్‌ కొనసాగుతుందని స్టార్‌స్పోర్ట్స్‌ ఆశాజనకంగా ఉంది. విస్తృత శ్రేణిలో సరౌండ్‌ ప్రోగ్రామింగ్‌,సాంకేతిక ఆవిష్కరణలతో,  ఈ ప్రసారకర్త ఇప్పుడు ఈ టోర్నమెంట్‌ వీక్షించే విధానంలో నూతన స్థితిని ఏర్పరచనుంది.  టాటా ఐపీఎల్‌ 2023 ఉత్సాహపూరితమైన టోర్నమెంట్‌గా నిలువనుంది.  వీక్షణ అనుభవాలను వృద్ధి చేయాలనే స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రయత్నాలు నిస్సందేహంగా దేశవ్యాప్తంగా వీక్షకులు,అభిమానులకు మరుపురాని అనుభవాలను అందించనున్నాయి.

Leave a Reply