శంకర్ – రామ్ చరణ్ మూవీ లేటెస్ట్ న్యూస్ ..
“రంగస్థలం ” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ వినయ విధేయ రామ” . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది . . వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు . రాజామౌళి బాహుబలి సినిమా తరువాత చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో రామ్ చరణ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది .. రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి అయిన తరువాత ఏ డైరెక్టర్ తో సినిమా ఉండబోతుందని సోషల్ మీడియా లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి , డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమాలు ఉంటాయని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి , ఫైనల్ గా ఈ వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ డైరక్టెర్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేసి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సౌత్ దిగ్గజ దర్శకుడు శంకర్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగాయి. ఇప్పటి వరకు సినిమా కు ప్రీ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తి చేసుకొని షూటింగ్ కు సిద్ధంగా ఉన్నారు చిత్ర యూనిట్ .. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూణె లో వేసిన భారీ సెట్టింగ్ లో మొదలుపెట్టనున్నారు ..ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం , మొదటి షెడ్యూల్ లోనే చరణ్ మరియు కియారాల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూణెలో వేగవంతంగా జరుగుతున్నాయి .. భారీ బడ్జెట్ తో రూపొందబోతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను దాదాపుగా నెల రోజుల పాటు ప్లాన్ చేస్తున్నారు . ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ రెండవ షెడ్యూల్ ను ప్రారంభిస్తారనే టాక్ వినిపిస్తోంది ..శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ రావడం అనేది అభిమానులకు గుడ్ న్యూస్ ..