భారతదేశంలో స్టూడెంట్ ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన డెలివరూ

హైదరాబాద్,20 ఏప్రిల్, 2023:గ్లోబల్ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన డెలివరూ, భారతదేశంలో గ్రాడ్యుయేషన్ కాలేజీ విద్యార్థుల కోసం తన మొదటి ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఆరు నెలల పెయిడ్ ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో ఉన్న వినూత్న ఫుడ్-టెక్ కంపెనీ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC) లో పని చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఇక్కడ వారికి రెస్టారెంట్ టెక్, కన్స్యూమర్‌ టెక్, డెలివరీ, కేర్ అండ్ ట్రస్ట్, ఫైనాన్స్ పై దృష్టి సారించిన కోర్ ఇంజనీరింగ్ బృందాలతో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వబడుతుంది.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వాసవి ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు వారి వ్యక్తిగత, సాంకేతిక, ప్రోటోటైపింగ్ నైపుణ్యాలను అంచనా వేయడానికి పలు రౌండ్ల ఇంటర్వ్యూలను కలిగిన పటిష్ఠ క్యాంపస్ నియామక కార్యక్రమం ద్వారా ఎంపిక చేశారు.

విద్యార్థులకు వారి సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి, వారికి ఉపాధి కల్పించే సాఫ్ట్ స్కిల్స్, అప్‌ డేట్ చేయబడిన పరిశ్రమ పరిజ్ఞానంతో సన్నద్ధం చేయడానికి అనుభవాన్ని పొందడంలో ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్ సహాయపడుతుంది. అంతే గాకుండా, కన్జ్యూమర్-ఫేసింగ్ టెక్నాలజీ వేగవంతమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది.

ఈ నేపథ్యంలో క్లిష్టమైన సవాళ్లను పరిష్కరిస్తున్న ఇంజనీరింగ్ బృందాలకు తాజా దృక్కోణాలను ఈ ప్రోగ్రామ్ అందిస్తుందని కూడా భావిస్తున్నారు. ఇది విద్యార్థులను వేగవంతమైన కెరీర్ మార్గంలో ఉంచుతుంది, కార్పొరేట్ వాతా వరణంలో కలిసిపోయే అధిక అవకాశాన్ని ఇస్తుంది.

ఈ కార్యక్రమంపై డెలివరూ ఇండియా వైస్ ప్రెసిడెంట్ – ఇంజినీరింగ్, కంట్రీ హెడ్ శశి సోమవరపు ఇలా అన్నారు: “భారతదేశంలోని ఆశాజనకమైన ఇంజనీరింగ్ ప్రతిభావంతులకు ప్రతిరోజూ డెలివరూ లో చోటు చేసుకునే సంచలనాత్మక సాంకేతికతలలో వారి అకడమిక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ను మెరుగు పరచడానికి మేం ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. వాసవి ఇంజినీరింగ్ కాలేజీతో మా భాగస్వామ్యం మాదిరిగానే, మేం భారతదేశం లోని ప్రీమియర్ విద్యా సంస్థలతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవాలనుకుంటున్నాం, ఇది రాబోయే సంవత్సరాల్లో ఐడీసీ కోసం చక్కటి టాలెంట్ పూల్‌ను రూపొందించడంలో మాకు సహాయ పడుతుంది.”

ప్రోగ్రామ్ అమలయ్యే కాలానికి సంబంధించి, ఇంటర్న్‌లు గుర్తించబడిన లక్ష్యాలు, సహకార అవకాశాలతో ప్రత్యేకమైన అభ్యాస ప్రణాళికను కలిగి ఉంటారు. రాబోయే దశల్లో భారతదేశం అంతటా హైదరాబాద్ ప్రాంతం దాటి ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌ను విస్తరించాలని కంపెనీ ప్రణాళికలు వేస్తోంది.

“డెలివరూతో మా ప్రయాణం ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. కళాశాల నుండి కార్పొరేట్ వాతావరణానికి మారడం మాకు లభించిన అన్ని రకాల మద్దతుతో సులభతరం చేయబడింది. నైపుణ్యం కలిగిన, నిష్ణాతు లైన వ్యక్తులందరితో కలసి పని చేయడం ద్వారా, నేను ప్రతి రోజు పనిలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రేరణ కలిగింది.

మేం ఈ తక్కువ వ్యవధిలో రూబీ ఆన్ రైల్స్, రియాక్ట్, గో, డాకర్, కాఫ్కా వంటి సాఫ్ట్‌ వేర్‌ లను నేర్చుకున్నాం. వివిధ మెంటర్ల ద్వారా ప్రతి వారం కొత్త నైపుణ్యాల మాడ్యూల్‌ను తెలుసుకుంటు న్నాం. మా సందేహాలను నివృత్తి చేయడానికి, మేం మంచి నిపుణులుగా ఉండేలా చేసేందుకు డెలివరూ రోజువారీ స్టాండ్-అప్‌లను నిర్వహించడం ద్వారా సహాయం చేస్తోంది” అని డెలివరూ డెవలప్‌మెంట్ సెంటర్‌ లోని ఇంటర్న్‌ లలో ఒకరైన అశ్రిత లోకసాని అన్నారు.

భారతదేశంలోని డెలివెరూ ఐడీసీ అనేది కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ వెలుపలి అతిపెద్ద సాంకేతిక కేంద్రం. ఇది భారతదేశంలో తన ప్రాథమిక ఇంజనీరింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇ స్తుంది. డెలివరూ 600 గ్లోబల్ ఇంజినీరింగ్ వర్క్‌ ఫోర్స్‌ లో 140 మంది ఈ కేంద్రం నుండి ఆధారపడి ఉన్నారు. ఇది విశ్లేషణలు, ప్లాట్‌ఫామ్‌లు, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ రంగంలో నిపుణులైన ఉద్యోగులను కలిగి ఉన్న డెలివరూ సెంట్రల్ టెక్నాలజీ ఆర్గనైజేషన్‌లో ప్రధాన భాగంగా పనిచేస్తుంది.

ఈ ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులు జులైలో తమ గ్రాడ్యుయేషన్ ముగించి, ఐడీసీలో ఫుల్ టైమ్ ప్రాతిపదికన చేరవచ్చు. ఇంటర్న్‌ షిప్ ప్రోగ్రామ్‌తో పాటు, ఐడీసీ ప్రస్తుతం అనేక ఖాళీల కోసం నియామకం చేస్తోంది. మరింత తెలుసు కోవడానికి దయచేసి ఈలింక్‌ని సందర్శించండి:

https://careers.deliveroo.it/en?query=&team=technology&country=india#filter-careers

Leave a Reply