వృద్ధిని న‌మోదుచేసిన కాన్వ‌ర్సేష‌న‌ల్ కామ‌ర్స్ ప్లాట్‌ఫాం గ‌ల్లాబాక్స్

చెన్నై, ఏప్రిల్ 30, 2023: చిన్న, మధ్యతరహా వ్యాపారాలు (ఎస్ఎంబీలు) వాట్సాప్ ద్వారా తమ అమ్మకాలను పెంచుకోవడానికి సహాయపడే కాన్వ‌ర్సేష‌న‌ల్ కామ‌ర్స్ ప్లాట్‌ఫాం గల్లాబాక్స్ భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 2023 నాటికి పెయిడ్ కస్టమర్ల సంఖ్య‌ రెట్టింపు కావడంతో కంపెనీ కొద్ది నెలల్లోనే గణనీయమైన విజయాన్ని సాధించింది. ట్రావెల్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ప్రొడక్ట్ కామర్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో 1,000కు పైగా సంస్థలు గల్లాబాక్స్ ను ఉపయోగిస్తున్నాయి.

గల్లాబాక్స్ కస్టమర్లలో పిక్ యువ‌ర్ ట్ర‌య‌ల్‌, గోఇర్లాండ్, వకీల్ సెర్చ్, జుపే, కావేరీ మెడ్స్, నెక్స్ట్ వేవ్, షిప్‌రాకెట్, ఇల్యూషన్ ఎలైన‌ర్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 2023 చివరి నాటికి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. గల్లాబాక్స్ కు భారతదేశంతో పాటు 20కి పైగా దేశాలకు చెందిన కస్టమర్లు ఉన్నారు. వచ్చే 6 నెలల్లో బ్రెజిల్, మిడిల్ ఈస్ట్, ఏపీఏసీలకు విస్తరించడంపై దృష్టి సారించింది.

వ్యాపారులు తమ కస్టమర్లతో వాట్సాప్ ద్వారా తక్షణమే సంభాషించడానికి, వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి, సహకార అనుభవాన్ని అందించడానికి గల్లాబాక్స్ వీలు కల్పిస్తుంది. మల్టీ-ఏజెంట్ టీమ్ ఇన్ బాక్స్, ప్రచార ఫీచర్లు అధునాతనమైనవే కానీ ఉపయోగించడానికి సులభమైన, నో-కోడ్ బాట్ తో లేయర్ అయ్యాయి. తద్వారా ఆటోమేషన్ శక్తితో సందేశాల సౌలభ్యాన్ని అందిస్తాయి. వాట్సాప్ డ్రిప్ క్యాంపెయిన్స్, వాట్సాప్ మార్కెటింగ్ ఆటోమేషన్, నో-కోడ్ వాట్సాప్ బోట్ బిల్డర్, వాట్సాప్ కేటలాగ్ & ఆర్డ‌ర్స్‌ తో సహా అనేక గేమ్-ఛేంజింగ్ ఫీచర్లను కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతం వాట్సాప్ పేమెంట్ల‌లో బీటా వెర్ష‌న్‌ను పరీక్షిస్తోంది.

ఇది త‌మ చెల్లింపు ప్రక్రియలను క్రమబద్ధీకరించుకోవాల‌ని చూస్తున్న వ్యాపారాలకు గ‌ణ‌నీయ‌మైన‌ ప్రభావాన్ని చూపుతుంది. గల్లాబాక్స్ దాని కొత్త ఫీచర్లతో పాటు, వ్యాపారాలు వారి కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌ ప్రయత్నాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడటానికి అనేక కొత్త సాధనాలను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో వాట్సాప్ రిమైండర్స్, వాట్సాప్ విడ్జెట్, క్యూఆర్ కోడ్ జనరేటర్, వాట్సాప్ లింక్ జనరేటర్ ఉన్నాయి. వాట్సప్ లో కస్టమర్లతో వ్యాపారాలు మమేకం కావడం, ఎంగేజ్ మెంట్, సేల్స్ ను పెంచడం గతంలో కంటే సులభతరం చేసేలా ఈ టూల్స్ ను రూపొందించారు.

కార్తీక్ జగన్నాథన్, యోగేష్ నారాయణన్ & యతిన్ పంచనాథన్ స్థాపించిన గల్లాబాక్స్, ఎస్ఎంబీలు తమ అమ్మకాలకు సంబంధించిన కాన్వ‌ర్సేష‌న్‌ల‌ను వాట్సాప్ ద్వారా నిర్వహించడానికి వీలు క‌ల్పిస్తుంది. పేలవమైన సంభాష‌ణ‌లు, వార‌స‌త్వ సాధ‌నాల‌తో వ‌చ్చే బ్రోకెన్ కస్టమర్ అనుభవాన్ని ఇది అంతం చేస్తుంది. నో-కోడ్ కాన్వ‌ర్సేష‌న్‌ కామర్స్ ప్లాట్‌ఫాం… వాట్సాప్ బిజినెస్ ఏపీఐని ఎస్ఎంబీలు వారి అమ్మకాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొబైల్ యాప్ అవసరం లేకుండా వారి వినియోగదారులకు పూర్తి మొబైల్ అనుభవాన్ని అందిస్తుంది.

జినోవ్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 75 మిలియన్ల ఎస్ఎంబీలు ఉన్నాయి, వాటిలో 20 మిలియన్లు డిజిటల్ మార్గంలో ఉన్నాయి. వాట్సాప్‌లో 200 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉండ‌గా, భారతదేశంలోనే 50 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. అదే స‌మ‌యంలో ఎస్ఎంఎస్‌లు ఎక్కువగా స్పామ్ బారిన ప‌డుతున్నాయి. దీంతో వ్యాపారాలు తమ వినియోగదారులతో కనెక్ట్ కావడానికి వాట్సాప్ మంచి మార్గ‌మ‌ని వేగంగా కనుగొంటున్నాయి.

వాట్సాప్ లో తమ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయడానికి, లావాదేవీలు జరపడానికి ఇంటరాక్టివ్ టూల్స్ ను నిర్మించడానికి సంస్థలకు వనరులు ఉన్నా.. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు ఈ అధునాతన సాధనాలను ఏర్పాటుచేసుకునేంత‌ బడ్జెట్ లేదా నైపుణ్యాలను కలిగి ఉండవు. గల్లాబాక్స్ అలాంటి వ్యాపారాలను నిమిషాల్లో పైకి తేవ‌డానికి, నడపడానికి సులభతరం చేస్తుంది. ఖాతాదారులకు అంత‌ర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించడానికి ముందుగానే సిద్ధంగా ఉన్న టెంప్లెట్ లైబ్ర‌రీని ఉపయోగిస్తుంది, కస్టమర్ సంభాషణలను అమ్మకాలుగా మారుస్తుంది.

ఈ సంద‌ర్భంగా గల్లాబాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓ కార్తీక్ జగన్నాథన్ మాట్లాడుతూ, “ఎస్ఎంఎస్, ఈమెయిల్, కాల్ సెంటర్ల వంటి సంప్రదాయ సాధనాలను ఉపయోగించి అవకాశాలను కస్టమర్లుగా మార్చుకోవడంలో చిన్న, మధ్యతరహా కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నా…

Leave a Reply