బంపర్ ఆఫర్ దక్కించుకున్న మిల్కీ బ్యూటీ …

       మెగాస్టార్ సరసన మరోసారి నటిస్తున్న మిల్కీబ్యూటీ …

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు .. మెగా స్టార్ చిరంజీవికి ఈ సినిమా 150 వ సినిమా కావడం విశేషం , ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి ఈ సినిమా విషయంలో ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .. మురుగదాస్ సినిమాను ఠాగూర్ గా రీమేక్ చేసి స్టార్ డైరెక్టర్ అయిన వి .వి. వినాయక్ మల్లి అన్నయ్య రీ ఎంట్రీ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .. ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు .. సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “ధ్రువ” .. ధ్రువ సినిమా తరువాత , డైరెక్టర్
సురేందర్ రెడ్డి లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ సఫీస్ దగ్గర బిగెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు . కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన “భరత్ అనే నేను ” సినిమా తరువాత కొరటాల శివ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేసాడు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగానే మెగా స్టార్ చిరంజీవి మరో ముద్దు సినిమాలు లైన్ లో పెట్టారు , వాటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఒకటి , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్‌’ సినిమా మరియు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు .. ప్రస్తుతం కొరటాలా శివ డైరెక్షన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య సినిమా తరువాత మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న
‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత ‘భోళా శంకర్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు . మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. నవంబర్‌ 11న ఉదయం 7:45 గంటలకు లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమవుతుందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో.. చిరుకు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు జోడీగా నటించే నాయికెవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడీ పాత్ర కోసం నటి తమన్నాను ఎంపిక చేసినట్లు వార్తాలు వినిపిస్తున్నాయి .సైరా నరసింహారెడ్డి సినిమా లో తమన్నా యాక్ట్ చేసింది , డైరెక్టర్ మెహెర్ రమేష్ మెగా స్టార్ చిరంజీవి సరసన తమన్నా అయితే బాగుంటుంది అని భావించి , తమన్నా ని కలిసి స్క్రిప్ట్ వినిపించారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తుంది అనే వార్తల్లో నిజం ఎంత వరకు ఉన్నదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …