మెగాస్టార్ 154 మూవీ ఫస్ట్ లుక్ అదిరింది…

బాబీ  డైరెక్షన్ లో మెగా స్టార్ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ ...

మెగా స్టార్ చిరంజీవి చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ వి వి వినాయక్ ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఠాగూర్ , తరువాత , మల్లి మెగా స్టార్ చిరంజీవి తో 150 వ సినిమా డైరెక్ట్ చేశారు . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ ,మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి – డైరక్టెర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు . ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ కాబట్టి ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ప్రాణం పెట్టి పని చేశారు , ఈ సినిమా లో బారి కాస్టింగ్ , భారీ సెట్టింగ్ , భారీ యాక్షన్ , మెగా స్టార్ యాక్టింగ్ ,మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు ..ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతము ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగానే మెగా స్టార్ చిరంజీవి మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టారు , వాటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఒకటి , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్‌’ సినిమా మరియు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు.. ప్రస్తుతము ఆచార్య సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది , చిరంజీవి ఆచార్య సినిమా తరువాత , గాడ్ ఫాదర్ , ,మరియు మెహెర్ రమేష్ డైరెక్షన్ లో సినిమాలు రెడీ గా ఉన్నాయి , కానీ వీటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ -ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి , మెగా స్టార్ కోసం డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎంతో మంది డైరెక్టర్స్ ఎదురుచూస్తున్నారు , ఫైనల్ గా ఇప్పుడు ఈ అవకాశం యంగ్ డైరెక్టర్ బాబీ కి దక్కింది .మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక సాలిడ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు , ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. . బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు ఈనెల 6వ తారీకున ఉదయం 11.43 కు లాంచనంగా జరుగబోతున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు ..ఈ సినిమా ఎనౌన్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. మెగా స్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో ఫైనల్ గా సినిమా ఎనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ తెలిపారు …