ఏపీ సియం జగన్ తో చిరు భేటీ సమస్య పరిష్కారం .. దటీజ్ మెగాస్టార్

సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త జీవోను జారీ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై అందరితో కలిసి ముఖ్యమంత్రి జగన్ మరోసారి మాట్లాడుతానని చెప్పారు. అప్పటి వరకు సినీ పరిశ్రమలోని వ్యక్తులేవరూ నోరు జారవద్దని సినిమా బిడ్డగా మెగాస్టార్ హితవు పలికారు. త్వరలోనే అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి… వన్ టూ వన్ మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. ఆ చర్చలో మాట్లాడిన వివరాలను వెల్లడించిన చిరంజీవి… సినీ పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు ఇక ముగిసినట్లేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారు. అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను. రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారు
సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని చెప్పారు.సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా.త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు.
ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు.పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తాం.