ఫెవేరేట్ హీరో ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్…

2006 లో డైరెక్టర్ హరీష్ శంకర్ – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ షాక్ .. ఈ మూవీ కంటే ముందు హరీష్ శంకర్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా రచయితగా పనిచేశారు .. ఈ సినిమాను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించారు .. షాక్ మూవీ తో హరీష్ శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి డైరెక్టర్ గా అడుగుపెట్టారు , మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది .. ఇక షాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరుత్సాహపరిచిన , ఆ తరువాత డైరెక్టర్ హరీష్ కొంత గ్యాప్ తీసుకొని సెకండ్ టైమ్ మల్లి మాస్ మహారాజ్ రవితేజ తో మిరపాకాయ్ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .. . ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ స్టామినాని , హరీష్ శంకర్ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .. .. ఈ హిట్ మూవీతో డైరెక్టర్ హరీష్ శంకర్ టాప్ దర్శకుల లిస్ట్ లోకి చేరిపోయాడు.

ఇక అసలు విషయానికి వెళ్ళితే హరీష్ శంకర్ రీమేక్ మూవీస్ తో నే హిట్ అందుకోగలడు అని సోషల్ మీడియా లో గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి , .. ఇక హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన గద్దల కొండ గణేష్ మూవీ కూడా రీమేక్ మూవీ కావడం మరో విశేషం .. ఇక ఈ మూవీ తరువాత హరీష్ శంకర్ పవన్ తో స్ట్రెయిట్ మూవీ
భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు .. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన హరిహర వీర మల్లు సినిమా పూర్తయిన తర్వాత హరీష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా తరువాత తాను డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది .. హరీష్ పవన్ సినిమా తరువాత చిరంజీవితో ఒక ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. ఇక మలయాళంలో వచ్చిన ‘బ్రో డాడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే .. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగు లో రీమేక్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారు .. అయితే . ఆ బాధ్యతలను డైరెక్టర్ హరీష్ శంకర్ కు అప్పగించారని టాక్ వినిపిస్తుంది .. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయాలనీ కోరిక బలంగా ఉంది , సరైన స్టోరి కోసం ఎదురుచూస్తున్నాడు , ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ హరీష్ శంకర్ కు రావడం చాలా లక్ .. రీమేక్ మూవీ అయినా తెలుగు నేటివిటీ కోసం హరీష్ శంకర్ తనదైన మార్పులు చేసి హరీష్ శంకర్ సక్సెస్ అందుకుంటారు .. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబంధించిన మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై పూర్తిగా క్లారిటీ వస్తుంది ..

Leave a Reply