ఉదయపూర్ లో కన్నుల పండుగగా జరిగిన బందర్ ఎం పి బాలశౌరి కుమారుని వివాహం…

మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగింది.. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నా సక్సెస్‌ సీక్రెట్‌ వాళ్లే… డా.మాధవి వెంకట్ (సెలబ్రిటీ సీక్రెట్స్‌ ఎండి)

ఈరోజు నేనెప్పటికి మరిచిపోలేను, నా సక్సెస్‌ సీక్రెట్‌కి కారణం తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతోమంది నటీన టులే. వారితో పాటు దేశంలోని అనేకమంది రాజకీయ, వ్యాపారవేత్తలు నాకు ఆప్తులు అయ్యారంటే దానికి కారణం నా మేకోవర్‌ కంపెనీ ‘‘సెలబ్రిటీస్‌ సీక్రెట్‌’’ అన్నారు డాక్టర్‌ మాధవి. బ్రాండ్‌తో ఒక డాక్టర్‌గానే కాకుండా వారందరి కుటుంబ సభ్యుల్లా నేను అందరిని ట్రీట్‌ చేస్తాను. మొదట నా క్లైయింట్స్‌కి ట్రీట్‌మెంట్‌ చేసేముందు నాకు నేను టెస్ట్‌ చేసుకున్నాక అది సక్సెస్‌ అయితేనే ఆ ట్రీట్‌మెంట్‌ను నా క్లైయింట్స్‌కి చేసి మంచి రిజల్ట్‌ వచ్చేటట్లు చేస్తాను. తద్వారా వాళ్లు రిజల్ట్‌తో సంతృప్తిగా ఉండటంతో మరో పదిమందికి మా క్లినిక్‌ గురించి చెప్పటం వల్ల మౌత్‌ పబ్లిసిటీతో ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. క్లైయింట్సందరూ ఎంజాయ్‌ చేసిన సేవలే నన్ను, మా వారు డాక్టర్‌ వెంకట్‌గారిని ఇంతమందికి దగ్గర చేశాయి అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అన్నారు ‘‘సెలబ్రిటీ సీక్రెట్స్‌’’ ఎండి డాక్టర్‌ మాధవి. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో మరో నూతన ప్రాజెక్ట్‌ను ప్రకటించారామె. డా.మాధవి ఉమెన్ ఎంటర్ ప్రైనర్, ఎస్తటిక్ ఫిజిషియన్, కాస్మేటలజిస్ట్.
ఈ సందర్భంగా
దా. మాధవి వెంకట్ మాట్లాడుతూ–‘‘ ఈ ప్రాజెక్ట్‌ను అతిత్వరలో ప్రారంభిస్తున్నాం అని నా పుట్టినరోజు రోజున ఎనౌన్స్‌ చేయటం ఆనందంగా ఉంది. అలాగే గతంలో హైదరాబాద్, విజయవాడ, కాకినాడల్లోని మా బ్రాంచెస్‌ పెద్ద స్థాయిలో విజయం సాధించటం వెనుక నా టీమ్‌ పడిన తొమ్మిదేళ్ల కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు ఆలీ, దివ్యవాణి, సన, రాజారవీంధ్ర, రజిత,హేమ, హిమజ, సురేఖావాణి, జ్యోతి, జయలక్ష్మీ గాయని మంగ్లీ, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ రాహుల్‌ సిప్లిగంజ్, భాను, ఐఏఎస్ అధికారిణి బాలా కథ, యాంకర్‌ రవి, జెస్సీలతో పాటు జ్ఙాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత ప్రవీణ కడియాల, అనిల్‌ కడియాల తదితరులు పాల్గొన్నారు.

ఆదరగోట్టిన లయన్ కిరణ్ కె పార్టీ …కౌబాయ్ స్టైల్ థీమ్ లో… ఫ్యాషన్ షో కేక…

వినూత్న శైలి కె పార్టీకి నగరం వేదిక అయ్యింది. పార్టీ ప్రియులకు మునుపెన్నడూ ఎరుగని అనుభూతులను  అందించి వావ్ అనిపించింది. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ బర్త్ డే పార్టీని ఆయన సన్నిహితులు కే  పార్టీగా ప్రతి ఏడాది ఎదో ఒక థీమ్ తో కని వినీ ఎరగని రితీ లో ఈ కె పార్టీ ఫ్యాషన్ షో అదరహో అనిపిస్తుంది.  అదే విధంగా ఆదివారం శిల్పారామం రాంచ్ రాక్ హైట్స్ లో  కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్ మరియు బాలీవుడ్ డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కె పార్టీ లో టాలీవుడ్ స్టార్స్, సినీనటులు, టాప్ బిజినెస్ మాన్స్ పాల్గొన్నారు. కౌబాయ్ స్టైల్ థీమ్ లో నిర్వహించిన ఈ నైట్ ఈవెంట్ ఆద్యంతం అతిధుల కు అపురూపమైన అనుభూతి పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో అదరహో అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్ గా మారడం విశేషం. ఆయన రాంప్ వాక్ ఆహూతుల హర్షధ్వానాలు అందుకుంది.

ముగ్ద స్టోర్ డిసెంబరు 5న గొప్ప ప్రారంభం జగదాంబ సెంటర్, వైజాగ్ లో…

టెంపుల్‌ థీమ్‌ స్టోర్‌ ముగ్ధ స్టోర్స్‌కి మాత్రమే ప్రత్యేకం ఇప్పుడు మన వైజాగ్ జగదాంబ సెంటర్ మరియు సంపత్ వినాయక రోడ్ లో

ప్రతి అందానికి ప్రతి బంధానికి ముగ్ధ…. ముగ్ధ సరికొత్త కంచి పట్టు ప్రపంచానికి స్వాగతం

టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను వైజాగ్ నగర వాసులకు డిసెంబరు 5న దగ్గర కానున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియో ని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి… ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరమైన విజయవాడ మరియు వైజాగ్ వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

ఈ సందర్భంగా శశి వంగపల్లి మాట్లాడుతూ ‘‘ వైజాగ్ నా అభిమాన నగరాల్లో ఒకటి. మాకు ఇక్కడ చాలా మంది సన్నిహుతులు ముఖ్యంగా ఏళ్లతరబడి క్లయింట్స్‌ ఉన్నారు. ఇక్కడ జరిగిన ఎన్నో అద్భుతమైన వివాహ వేడుకల్లో మేం భాగం పంచుకున్నాం. అంతేకాదు ఇక్కడ నుంచీ హైదరాబాద్‌లోని మా స్టోర్స్‌కు ఎందరో క్లయింట్స్‌ వస్తుంటారు. ఈ అందమైన నగరంలో భాగం కావడమనేది మా కల. ఈ నగరంలో ముగ్ధ స్టోర్‌ ప్రారంభించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ కల ఇప్పటికి సాకారమైంది’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

బల్లాల దేవ టీజర్ కు డేట్ ఫిక్స్

భీమ్లా… భీమ్లా నాయక్‌’ అని ఒకరు. ‘డేని… డేనియల్‌ శంకర్‌’ అంటూ మరొకరు. ఇద్దరూ శక్తిమంతమైన వ్యక్తులే. మరి వీరిద్దరి మధ్య గొడవేమిటో… అది ఎక్కడివరకు దారి తీసిందో తెలియాలంటే మాత్రం ‘భీమ్లా నాయక్‌’ విడుదల వరకు ఆగాల్సిందే. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమా పేరుని అధికారికంగా ప్రకటించడంతోపాటు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది .. ఇప్పటికే రిలీజైన పవన్ టీజర్ ఇంట్రో సాంగ్ కు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .. పవన్ అభిమానులు పవన్ గ్లిమ్స్ ఫై ఫుల్ హ్యాపీ గా ఉన్నారు .. పవన్ కళ్యాణ్ కు సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు కానీ , రానా కు సంబంధించి ,ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ,రానా ఫాన్స్ రానా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు . రానా క్యారెక్టర్ గురించి సోషల్ మీడియా లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి .. అయితే ఈ నెగిటివ్ కామెంట్స్ పై చిత్రబృందం క్లారిటీనిచ్చింది
రానా పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అంటూ రానా అభిమానులకు క్లారిటీనిచ్చారు. .రానా పాత్రకు సంబంధించిన వీడియో సెప్టెంబర్ 17 తర్వాత ఏ క్షణం అయినా బయటకు వస్తుంది. ఈ టీజర్ పవన్ టీజర్ తరహాలోనే పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న కంటెంట్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో రానా పాత్రను తక్కువ చేశారా ఎక్కువ చేశారా? అన్నది తెలియాలంటే టీజర్ వరకూ ఆగాల్సిందే.

హీరోగా “గణేష్ బెల్లంకొండ”

*హీరోగా “గణేష్ బెల్లంకొండ” పరిచయ చిత్రం ”స్వాతిముత్యం”
*ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం.

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. అతని పేరు “గణేష్ బెల్లంకొండ” ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ ‘గణేష్’.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘గణేష్’ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, ‘గణేష్’ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు. ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.
‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.
ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ.లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ

1 88 89 90