రాజమౌళి కి చెక్ పెడుతున్న పవర్ స్టార్…

   ఆర్ ఆర్ ఆర్  సినిమాకు పోటీగా భీమ్లా నాయక్...


వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి .. ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్న సినిమా కావడంతో అభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు …. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని టీజర్ , మరియు పాటలను చిత్ర యూనిట్ విడుదల చేయగా అభిమానుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది .. జనవరి 12 న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్ కు డైరెక్టర్ రాజమౌళి గట్టి షాక్ ఇచ్చారు .రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నారు .. భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ గురించి సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. భీమ్లా నాయక్ సినిమాను చెప్పినట్టుగానే సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయాలని నిర్మాత లు గట్టిగా నిర్ణయించుకున్నారు …. భీమ్లా నాయక్ సినిమా నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను ఖచ్చితంగా సంక్రాంతి కే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వస్తున్న ఈ వార్తల ప్రకారం చూస్తే ఈ సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ భీమ్లా నాయక్, రాదే శ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది …