పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క సినీ నట ప్రస్థానం…

అనుష్క – బర్త్ డే స్పెషల్ స్టోరీ …

               

అనుష్క సూపర్ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి , ఒక్కో మెట్టు ఎక్కి ఈ రోజున అందరి స్టార్ హీరోస్ కి లక్కీ హీరోయిన్ అని అనిపించుకుంది .. హీరోలతో పోటీ పడి , ఒక్కో సినిమా లో గ్లామర్ రోల్ , లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ , ఏ సబ్జెక్ట్ అయిన , ఏ జానర్ అయిన , తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది .పూరీ జగన్నాధ్ – కింగ్ నాగార్జున కాంబినేషన్ లో 2005 లో సూపర్ సినిమా కోసం మొదటగా చాలా మంది హీరోయిన్స్ అనుకోగా , ఫైనల్ గా పూరీ అనుష్క ను సెలెక్ట్ చేశారు అలా అనుష్క టాలివుడ్ కి పరిచయము అయింది .. అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా ఉండేది , అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి , కానీ సూపర్ సినిమా తో నాగార్జున పేరు మార్చి అనుష్క అని పెట్టడం జరిగింది .. అనుష్క సినిమా ఎంట్రీ చాలా యాదృచ్చికంగా జరిగింది .. సూపర్ సినిమా తో అనుష్క ఎంట్రీ ఇచ్చి తన నటనతో మరియు గ్లామర్ తో ప్రేక్షకులను అక్కటుకుంది .. సూపర్ సినిమా ఫలితం ఎలా ఉన్నా అందరూ అనుష్క గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు .. సూపర్ సినిమా తరువాత అనుష్క రాజమౌళి కంటిలో పడింది , రాజమౌళి సినిమాల్లో , హీరోకి మరియు విలన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది , కానీ విక్రమార్కుడు సినిమాలో రవితేజ సరసన నటించి , తన గ్లామర్ తోను , తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది .. ఆరు అడుగుల ఎత్తు , హీరో కి పెర్ఫెక్ట్ పెయిర్ అనిపిస్తే ఏ డైరెక్టర్ అయిన అనుష్క తో సినిమా చెయ్యాలనే అనుకుంటారు .. విక్రమార్కుడు సినిమాలో రవితేజ తో పోటీ పడి నటించి , హిట్ అందుకోవడమే కాకుండా అందురు తన గురించి మాట్లాడుకునేలా చేసి , అందరి హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది .. విక్రమార్కుడు సినిమా తరువాత చేసిన అస్త్రం ,సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది .. 2006 లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్టాలిన్ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి తో ఒక స్పెషల్ సాంగ్ లో చిరంజీవి తో పోటీ పది డాన్స్ చేసి , మరో మెట్టు ఎక్కింది , ఈ సినిమా లో తన డాన్స్ చూసి మెగాస్టార్ తనకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు .. విక్రమార్కుడు ,స్టాలిన్ సినిమా తరువాత అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుసగా సినిమా ఆఫర్స్ వస్తానే ఉన్నాయి ..

అనుష్క నటనకు , గ్లామర్ కు ఫిదా అయిన స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ అంతా అనుష్క డేట్స్ కోసం ఎదురుచూసేవారు .. అనుష్క తెలుగుతో పాటు తమిళంలోనూ ఎన్నో సినిమాలు చేసి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది .. సినిమాల్లో హీరోయిన్స్ ఎంత కష్టపడిన , గ్లామరస్ రోల్స్ చేశారు అని అనుకుంటారు , కానీ అనుష్క మాత్రం , గ్లామర్స్ రోల్స్ తో పాటు లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేసి బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ..అనుష్క దగ్గరకు వచ్చిన ఏ సినిమా అయినా ఏ డైరెక్టర్ అయినా ఒక సారి స్టోరీ నేరేషన్ ఇచ్చాకా , ఆ క్యారెక్టర్ కు ప్రాణం పెట్టి పని చేస్తుంది .. గోపీచంద్ తో లక్ష్యం , మరియు శౌర్యం సినిమాల్లో నటించి , మంచి పెయిర్ గా ప్రేక్షకుల చేత అనిపించుకుంది , వరుస గా రెండు సినిమాలు గోపీచంద్ తో నటించడం తో వీరిద్దరి గురించి సోషల్ మీడియా లో కొన్ని రూమర్స్ వినిపించాయి .. కింగ్ నాగార్జున తో సూపర్ సినిమా తరువాత డాన్ , కేడి , రగడ , డమరుకం సినిమాల్లో నటించి నాగార్జున కు లక్కీ హీరోయిన్ అనిపించుకుంది .. అనుష్క సినీ కెరీర్ లో అందరి స్టార్ హీరోస్ ను కవర్ చేసింది .. సీనియర్ హీరోలు , నాగార్జున , బాలకృష్ణ , వెంకటేశ్ అందరితో నటించి ఇండస్ట్రీ లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది .. రవితేజ తో విక్రమార్కుడు సినిమా తరువాత మల్లి రెండో సారి రెండో సారి బలాదూర్ సినిమా లో నటించింది ..2009 లో అనుష్క చేసిన అరుంధతి సినిమా తన కెరీర్ నే మార్చేసింది ..కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సీనిమా లో అనుష్క నటనకు ప్రేక్షకులు జై జైలు కొట్టారు .. అరుంధతి’కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్. అన్ బిలీవబుల్ ఓపెనింగ్స్. ఫస్ట్ 35 ప్రింట్స్‌తో రిలీజ్ చేసిన సినిమా, సెకండ్ వీక్ 290 ఫిజికల్ ప్రింట్స్‌కి, డిజిటల్ ప్రింట్స్‌కి ఎగ బాకింది. ఫైనల్‌గా 360 ప్రింట్స్ వేశారు. దటీజ్ ద పిక్చర్స్ స్టామినా. ‘వదల బొమ్మాళీ నిన్నొదలా’ అంటూ బాక్సా ఫీస్‌కు అతుక్కుపోయింది ‘అరుంధతి’…

అరుంధతి సినిమా తో మంచి స్టార్ డమ్ , మరియు టాలెంటెడ్ నటి గా ప్రూవ్ చేసుకున్న అనుష్క కు ఈ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి .. తెలుగు తో పాటు తమిళం లో కూడా అనుష్క బాగా పాపులర్ అయి అక్కడ కూడా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది .. అరుంధతి సినిమా తరువాత ప్రభాస్ తో బిల్లా సినిమా చేసింది , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా గా వచ్చిన బిల్లా సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది ఇదే వీరిద్దరి మొదటి సినిమా ,ఈ సినిమాలో అనుష్క చాలా గ్లామరస్ రోల్ లో కనిపించి , ఇద్దరి కెమిస్ట్రీ కుదిరి సినిమా హిట్ అవ్వడంతో పాటు ప్రభాస్ కు కరెక్ట్ జోడి అని అనిపించుకుంది . బిల్లా సినిమా తర్వాత 2010 లో తమిళ స్టార్ సూర్య తో కలిసి తెలుగు తమిళ్ భాషలో సింగం అనే సినిమాలో నటించింది , ఈ సినిమా తెలుగు తమిళ్ లో సూపర్ హిట్ అందుకుంది , ఈ కాంబినేషన్ మరో సారి రిపీట్ అవుతూ సింగం 2 సింగం 3 సినిమాలు వచ్చాయి .. అనుష్క నటించిన సినిమాల్లో వేదం సినిమా చాలా స్పెషల్ , కొన్ని పాత్రలు ఎప్పటికి మరచిపోలేము వేదం సినిమాల్లో అనుష్క చేసిన సరోజ క్యారెక్టర్ మంచి పేరు రావడమే కాకుండా , ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది .. వేదం సినిమా తరువాత పంచాక్షరీ అనే సినిమా చేసింది , ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోపోయిన ఈ సినిమాలో అనుష్క పాత్రకు మంచి పేరు వచ్చింది ..అనుష్క – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఖలేజా ఈ సినిమా లో మహేష్ బాబు సరసన నటించి హిట్ పెయిర్ అనిపించుకుంది .. టాలీవుడ్ హీరోలు అందరి తో నటిస్తూ , సౌత్ ఇండియన్ స్టార్ రజినీకాంత్ సరసన లింగ సినిమాలో కూడా నటించింది ..లింగ సినిమా తరువాత రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి , మరియు బాహుబలి 2 సినిమా లో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ..ప్రభాస్ ది – అనుష్క ది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బిల్లా , మిర్చి , మరియు బాహుబలి ,బాహుబలి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాయి .. గుణశేఖర్ – అనుష్క కాంబినేషన్ లో వచ్చిన చారిత్రక చిత్రం రుద్రమదేవి ..సుమారు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన రుద్రమదేవి సినిమా లో రుద్రమ దేవిగా అనుష్క తప్పితే వేరే ఎవ్వరిని ఊహించుకోలేము , రాణి రుద్రమ దేవిగా గా అనుష్క నటనకు ప్రేక్షకులను బాగా అలరించింది .. బాహుబలి , రుద్రమదేవి పెద్ద సినిమాలు చేస్తేనే సైజ్ జీరో అనే రొమాంటిక్ సినిమా చేసింది , పాత్ర నచ్చలే కానీ తాను ప్రాణం పెట్టి పని చేస్తుంది సైజ్ జీరో సినిమా కోసం బాగా లావు అయి బాగా కష్టపడి పనిచేసింది , కానీ సైజ్ జీరో సినిమా అనుష్క కు డిస్సపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా ప్రేక్షకుల చేత కొన్ని విమర్శలు కూడా అందుకుంది ..బాహుబలి:ద కంక్లూజన్ సినిమా తరువాత అనుష్క డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన థ్రిల్లర్ సినిమా భాగమతి. భాగమతి సినిమా తో ప్రేక్షకులను భయపెట్టి హిట్ అందుకున్న అనుష్క ఆ తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా స్టార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ మహారాణి లక్ష్మి భాయ్ గా నటించింది .. సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో థ్రిల్లర్ సినిమా గా నిశ్శబ్దం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . నిశ్శబ్దం సినిమా అనుష్క కు ఎంతో స్పెషల్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుష్క ఇండస్ట్రీ కి వచ్చి 15 ఏళ్ళు అయ్యాయి అని తనను డైరెక్ట్ చేసిన స్టార్ డైరెక్టర్స్ అందరూ వచ్చి స్వీటీ కి బెస్ట్ విషెస్ తెలిపారు .. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వీటీ అందరికి దగ్గర అయింది .. భవిష్యతులో కూడా అనుష్క మరిన్ని మంచి సినిమాలు చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు ……